కేంద్ర ప్రభుత్వ మరోసారి సంచలన నిర్ణయం తీసుకుంది. ఏకంగా 232 యాప్ లను బ్యాన్ చేస్తూ తాజాగా నిర్ణయం తీసుకుంది. అయితే కేంద్ర ప్రభుత్వ రద్దు చేసిన ఆ యాప్ లు ఏంటి? అసలు ఎందుకు భారత్ ఒకేసారి అన్ని యాప్ లను బ్యాన్ చేసింది? అసలేం జరిగిందనే పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం. భారత్ లో చలామణి అవుతున్న చైనా యాప్ లపై కేంద్రం ఉక్కుపాదం మోపింది. ఏకంగా 232 యాప్ లపై నిషేధం విధిస్తూ తాజాగా సంచలన నిర్ణయం తీసుకుంది. అయితే ఈ నిషేధంలో భాగంగా… 138 బెట్టింగ్స్, 94 లోన్ యాప్ లను బ్యాన్ చేస్తూ ఆదేశాలు జారీ చేసింది. ఇకపోతే గత కొంత కాలం నుంచి తెలుగు రాష్ట్రాల్లో లోన్ యాప్ నిర్వాహకులు వేధింపులకు గురి చేస్తున్నవిషయం తెలిసింది.
కాగా, లోన్ యాప్ నిర్వాహకుల వేధింపులు భరించలేక ఇప్పటికీ ఎంతో ఆత్మహత్యకు పాల్పడ్డారు. తద్వారా కేంద్ర ప్రభుత్వం 94 లోన్ యాప్ లను నిషేధిస్తూ నిర్ణయం తీసుకుంది. ఇక ఇదే కాకుండా 138 బెట్టింగ్ యాప్ లను సైతం బ్యాన్ చేసింది. ఇలాంటి యాప్ ల ద్వారా యువత చెడు మార్గంలోకి వెళ్లడమే కాకుండా.. ఈ యాప్ ల వల్ల భవిష్యత్ లో దేశ భద్రతకు ముప్పు వాటిల్లే అవకాశం ఉండడంతో యాప్ లను రద్దు చేస్తూ నిర్ణయం తీసుకుంది. ఇదిలా ఉంటే ఈ యాప్ లపై గత 6 నెలల కిందట నుంచే కేంద్ర ప్రభుత్వం కాస్త ఫోకస్ పెట్టి తాజాగా ఒకేసారి 232 యాప్ లను రద్దు చేయడం విశేషం. కేంద్ర సర్కార్ బ్యాన్ చేసిన చైనా యాప్ లపై మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి.