రిపోర్టర్ గా మారిన చిన్నారి! వీడియో వైరల్

ప్రపంచం టెక్నాలజీ రంగంలో ఎంతో అభివృద్ది సాధిస్తూ వస్తుంది. ఇక సోషల్ మీడియా వచ్చినప్పటి నుంచి ఎక్కడెక్కడి విషయాలు మన కళ్లముందు ఆవిష్కరించబడుతున్నాయి. సోషల్ మీడియా ద్వారా ఎంతో మంది ఔత్సాహికులు వెలుగులోకి వస్తున్నారు. వింతలు.. విశేషాలు మన కళ్లముందు ఉంచబడుతున్నాయి. అయితే గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో ప్రజలు ఎదుర్కోంటున్న సమస్యలు సోషల్ మాద్యమాల ద్వారా అధికారుల దృష్టికి వెళ్లిన సందర్భాలు ఉన్నాయి.

image 1 compressed 50ఓ చిన్నారి తమ చుట్టుపక్కల రోడ్లు ఎంత దారుణమైన పరిస్థితుల్లో ఉన్నాయో తెలియజేస్తూ రిపోర్టర్ గా మారింది. ఇందుకు ఆ చిన్నారి తల్లి కెమెరామాన్ గా మారింది. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట్లో తెగ చక్కర్లు కొడుతుంది. కాశ్మీర్ రోడ్ల పరిస్థితి ఎంత అధ్వానంగా ఉందో.. ప్రజలు ఏ విధంగా చెత్త పారేస్తున్నారో వివరించింది. ఈ రోడ్లు అంత దారుణంగా ఉండడం వలన తన ఇంటికి అతిథులు రాలేకపోతున్నారని చెప్పుకొచ్చింది. చివరలో కెమెరామెన్ అమ్మతో అని ముగించింది.

ఇది చదవండి : కేటీఆర్ పెద్ద మనసు.. వికలాంగ క్రీడాకారిణికి ఆపన్నహస్తం

image 0 compressed 50ఇక ఆ చిన్నారి ముద్దు ముద్దుగా మాట్లాడుతూ రోడ్ల పరిస్థితిపై ఎంతో చక్కగా రిపోర్టింగ్ చేయడంపై నెటిజన్లు తెగ మెచ్చుకుంటున్నారు. ఇటీవల కశ్మీర్ లోయలో భారీ మంచు, వర్షం కురిసిన సంగతి తెలిసిందే. ఈ చిన్నారి రిపోర్టింగ్ పై మీ అభిప్రాయాలు కామెంట్స్ రూపంలో తెలియజేయండి.