కేటీఆర్ పెద్ద మనసు.. వికలాంగ క్రీడాకారిణికి ఆపన్నహస్తం

KTR Helps a Deaf Sports Girl

మంత్రి కేటీఆర్ సోషల్ మీడియాలో చాలా యాక్టీవ్ గా ఉంటారు. ఆయన దృష్టికి వచ్చిన సమస్యలను వీలైనంత వరకు పరిష్కరించడానికి ప్రయత్నిస్తారు. ఆర్థిక సాయం కావాలన్నా చేస్తారు. తాజాగా మరోసారి పెద్ద మనసు చాటుకున్నారు మంత్రి కేటీఆర్. ఓ వికలాంగ క్రీడాకారిణి భారీ ఎత్తున ఆర్థిక సాయం అందించారు. ఆ వివరాలు..

పంజాబ్ కు చెందిన దివ్యాంగ క్రీడాకారిణి మల్లికా హందాకు మంత్రి కేటీఆర్ ఆర్థికసాయం అందించారు. మల్లికా హందా చెస్ క్రీడాకారిణి. చెస్ పోటీల్లో జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో అనేక పతకాలు గెలిచినా తనకు ఎలాంటి సహకారం అందడంలేదని ఆవేదన వ్యక్తం చేస్తూ పోస్ట్ చేసిన వీడియో దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది.

తన వైకల్యాన్ని సవాలు చేస్తూ జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో అద్భుతమైన క్రీడా నైపుణ్యాన్ని ప్రదర్శించిన మల్లికాకు సహకారం అందించేందుకు మంత్రి కేటీఆర్ ముందుకు వచ్చారు. ఈ మేరకు పంజాబ్ లోని జలంధర్ నుంచి ఆమెను హైదరాబాద్ పిలిపించి ఆర్థిక సహాయం చేశారు. ఇంత అద్భుతమైన నైపుణ్యం ఉన్న మల్లికా హందాకు తగిన ప్రోత్సాహం దక్కకపోవడం పట్ల మంత్రి కేటీఆర్ ఆవేదన వ్యక్తం చేశారు. అమెను సన్మానించడమే కాకుండా ల్యాప్ టాప్ తో పాటుగా, 15 లక్షల రూపాయల ఆర్థిక సహాయాన్ని అందించారు.

జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో మల్లికా సాధించిన విజయాలతో ఈ సమాజం గర్వపడుతుందని, మరింత సహాయం, ప్రశంసలు అందుతాయన్నారు. మల్లికా హందాకు మరింత సహాయం అందించాలని కేంద్ర యువజన వ్యవహారాలు, క్రీడా శాఖ మంత్రి అనురాగ్ ఠాకూర్ ను మంత్రి కేటీఆర్ కోరారు. ఈ విషయంపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి.