సినీ ఇండస్ట్రీలో సల్మాన్ ఖాన్ అంటే ఓ ప్రత్యేక ఇమేజ్ ఉంది. ఎన్నో సూపర్ హిట్ చిత్రాల్లో నటించిన సల్మాన్ ఆ మద్య చిరంజీవి నటించిన గాడ్ ఫాదర్ మూవీతో తెలుగు తెరపై కనిపించాడు. సల్మాన్ ఇప్పటికీ స్టిల్ బ్యాచిలర్.. అందుకే ఆయనకు చాలా మంది పెళ్లి ప్రపోజల్స్ చేస్తుంటారు.
బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ గురించి ప్రత్యేక పరిచయం అక్కరలేదు. దాదాపు ఆరుపదుల వయసు వస్తున్నా.. స్టిల్ బ్యాచిలర్ గానే ఉన్నారు. గతంలో పలువరు హీరోయిన్లతో ప్రేమాయణం నడిపించిన సల్మాన్ పెళ్లి పీటల వరకు తీసుకురాలేకపోయారు.. ఈ విషయం గతంలో తనే ఒప్పుకున్నాడు. ఆయనతో ఎవరు ఇంటర్వ్యూ చేసినా ఖచ్చితంగా పెళ్లి ప్రస్తావన తీసుకువస్తుంటారు. దానికి సల్మాన్ కూడా సమయం వస్తే ఏదీ ఆగదు అన్నట్లు సమాధానం చెప్పడంతో ఆయన పెళ్లి చేసుకుంటాడా లేదా? ఒకవేళ చేసుకుంటే ఎవరిని చేసుకుంటాడు? అన్న ప్రశ్నలు నెట్టింట చర్చలు సాగుతూ ఉంటాయి. తాజాగా ఓ లేడీ రిపోర్టర్ సల్మాన్ కి పెళ్లి ప్రపోజల్ చేయగా.. ఫన్నీగా జవాబు చెప్పారు. వివరాల్లోకి వెళితే..
సినీ ఇండస్ట్రీలో సల్మాన్ ఖాన్ అంటే విపరీతమైన క్రేజ్ ఉంది. సోషల్ మీడియాలో సల్మాన్ ఖాన్ పెళ్లి గురించి.. ప్రేమ వ్యవహారాల గురించి ఎప్పుడూ చర్చలు నడుస్తూనే ఉంటాయి. ప్రస్తుతం ఆయన కుటుంబ సభ్యులతో ఉంటూ బ్యాచ్‌లర్ లైఫ్‌నే ఎంజాయ్ చేస్తున్నాడు. ఇండస్ట్రీలో ఎంట్రీ ఇచ్చినప్పటి నుంచి ఆయన లైఫ్ లో ఎంతోమంది స్టార్ హీరోయిన్లతో ప్రేమ వ్యవహారాలు నడిపించారని.. ఆయనతో డేటింగ్ చేసేవారు ఎంతో మంది ఉంటారని ఇండస్ట్రీలో టాక్. ఎంతమందిని ప్రేమించిన ఎవరినీ పెళ్లి చేసుకోలేదు.. సల్మాన్ ఇక పెళ్లి చేసుకుంటాడన్న నమ్మకం అటు ఫ్యాన్స్ కి, ఇటు కుటుంబానికి లేకుండా పోయింది. కానీ ఇప్పటికీ ఆయనకు ఎంతోమంది అమ్మాయిలు ప్రేమ, పెళ్లి ప్రపోజల్స్ చేస్తూనే ఉంటారు.
ప్రస్తుతం దుబాయ్‌లో జరుగుతున్న ఇంటర్నేషనల్ ఇండియన్ ఫిల్మ్ అకాడమీ అవార్డులు(ఐఫా) అవార్డుల ప్రధానోత్సవ కార్యక్రం ఎంతో ఘనంగా జరుగుతుంది. ఈ కార్యక్రమానికి తారల సందడి ఓ రేంజ్ లో కొనసాగింది. ఐఫా అవార్డు వేడుకల్లో బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ పాల్గొన్నారు.. ఈ సందర్బంగా ఓ లేడీ రిపోర్టర్ సల్మాన్ ఖాన్ ప్రపోజల్ చేసింది. ‘సల్మాన్ జీ నేను మీకోసం హాలీవుడ్ నుంచి వచ్చాను.. అనగానే షారూఖ్ ప్రస్తావన తెచ్చాడు. లేదు నేను మీ కోసం వచ్చాను.. మీ గురించే మాట్లాడుతున్నా.. మీరు నన్ను పెళ్లి చేసుకుంటారా’ అని అడిగింది. దానికి సల్మాన్ ‘అబ్బే నాకు పెళ్లి వయసు దాటిపోయింది.. మీరు 20 ఏళ్ల క్రితం నన్ను కలిసి ఉంటే’ అంటూ ఫన్నీగా రిప్లై ఇచ్చారు. దాంతో అక్కడు ఉన్నవాళ్లంతా నవ్వుకున్నారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది.