బాలీవు్డ్ స్టార్ సల్మాన్ ఖాన్ నటించిన బ్లాక్ బస్టర్ మూవీ ‘బజరంగి భాయ్‌జాన్’ గురించి ప్రేక్షకులకు ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఈ సినిమాలో సల్మాన్ తర్వాత అంతటి ఇంపార్టెన్స్ ఉన్న క్యారెక్టర్ ‘మున్నీ’. ఆ పాత్రలో నటించి ప్రేక్షకులను ఆకట్టుకుంది హర్షాలీ మల్హోత్రా.
బాలీవు్డ్ స్టార్ సల్మాన్ ఖాన్ నటించిన బ్లాక్ బస్టర్ మూవీ ‘బజరంగి భాయ్‌జాన్’ గురించి ప్రేక్షకులకు ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఈ సినిమాలో సల్మాన్ తర్వాత అంతటి ఇంపార్టెన్స్ ఉన్న క్యారెక్టర్ ‘మున్నీ’. ఆ పాత్రలో నటించి ప్రేక్షకులను ఆకట్టుకుంది హర్షాలీ మల్హోత్రా. 2015 జూలై 17న రిలీజ్ అయిన ఈ చిత్రం 2023 జూలై 17 నాటికి 8 సంవత్సరాలు పూర్తి చేసుకుంటోంది. కబీర్ ఖాన్ డైరెక్ట్ చేయగా, స్టార్ రైటర్, రాజమౌళి తండ్రి విజయేంద్ర ప్రసాద్ కథనందించారు. కరీనా కపూర్, నవాజుద్దిన్ సిద్ధిఖి, శరత్ సక్సేనా తదితరులు నటించారు. ఇక హర్షాలీ విషయానికొస్తే, ఆమె ఇప్పుడెలా ఉందో తెలుసా? అంటూ న్యూస్ చక్కర్లు కొడుతోంది.
హర్షాలీ మల్హోత్రా 2008 జూన్ 3న జన్మించింది. ‘బజరంగి భాయ్‌జాన్’ అప్పుడు తన వయసు 7 సంవత్సరాలు. ప్రస్తుతం 15 ఏళ్లు. సల్లూ భాయ్ సినిమాతోనే బాలనటిగా బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది. ఫస్ట్ సినిమానే అయినా పాకిస్థాన్‌కు చెందిన మూగ బాలికగా అద్భుతంగా నటించింది. సినిమా వచ్చి ఇన్నేళ్లయినా తను చేసిన మున్నీ క్యారెక్టర్‌ని అంత త్వరగా మర్చిపోలేం. ఫన్నీగా, ఎమోషనల్‌గా వేరియేషన్స్ చూపిస్తే.. చిన్నతనంలోనే అందర్నీ ఆకర్షించింది. ఈ సినిమాకి గానూ హర్షాలీకి రూ. 3 లక్షల పారితోషికం ఇచ్చారని సమాచారం.
సల్మాన్ సినిమా తర్వాత మళ్లీ నటించలేదు. కానీ సల్మాన్‌తో టచ్‌లో ఉన్నానని చెప్పిందని అంటున్నారు. ప్రస్తుతం చదువుకుంటూ తనకిష్టమైన సంగీతం నేర్చుకుంటోంది. రీసెంట్‌గా మ్యూజిక్ క్లాస్‌కి వెళ్లొస్తూ కెమెరాల కంట పడింది. దీంతో తన పిక్స్, వీడియోస్ వైరల్ అవుతున్నాయి. ‘హర్షాలీ అప్పుడే ఎంత పెద్దదైపోయింది. ఇప్పటికీ అలాగే ఉంది. నువ్వు ఎప్పటికీ మా మున్నీవే’ అంటూ కామెంట్స్ చేస్తున్నారు నెటిజన్లు.