జైలులో ఉన్నప్పుడు టాయిలెట్స్ ని శుభ్రం చేసానని సల్మాన్ ఖాన్ చెప్పాడు
మూడు దశాబ్దాలకు పైగా భారతీయ చిత్ర పరిశ్రమని తన అద్భుతమైన నటనతో ఉర్రూతలూగిస్తున్న బాలీవుడ్ అగ్ర నటుడు సల్మాన్ ఖాన్. అభిమానులందరూ ముద్దుగా సల్లు భాయ్ అని పిలుచుకుంటారు. సల్మాన్ ఖాన్ గురించి ఏ చిన్న విషయం బయటకు వచ్చినా అది పెద్ద సంచలనమే అవుతుంది. ఇప్పుడు తాజాగా సల్మాన్ ఖానే స్వయంగా తాను చేసిన ఒక విషయం గురించి చెప్పేసరికి ఇప్పుడు దేశ వ్యాప్తంగా వైరల్ అవుతున్నాయి.
సల్మాన్ ఖాన్ ప్రస్తుతం ఓటీటీలో ప్రసారం అవుతున్న బిగ్ బాస్ 2 సీజన్ కి హోస్ట్ గా వ్యవహరిస్తున్న విషయం అందరికీ తెలిసిందే. నిన్న సోమవారంతో బిగ్ బాస్ 2 కి గుమ్మడి కాయ కొట్టడం జరిగింది. ఈ ప్రోగ్రాం చివరి రోజున సల్మాన్ ఖాన్ కొన్ని ఆసక్తికర వ్యాఖ్యలు చేసాడు. బిగ్ బాస్ 2 సీజన్ ద్వారా ప్రస్తుతం ఎంతోమంది సెలబ్రిటీస్ గా కూడా మారారు. అందులో పూజాభట్ కూడా ఒకరు. పూజాభట్ బిగ్ బాస్ హౌస్ లో ఉన్న సమయంలో లోపల ఉన్న టాయిలెట్స్ ని చాలా క్లీన్ గా ఉంచేదని సల్మాన్ పూజని ప్రశంసిస్తూ చెప్పుకొచ్చాడు. సల్మాన్ ఖాన్ అంతటితో ఆగకుండా తాను చేసిన పని గురించి చెప్పేసరికి షో లో ఉన్న వాళ్ళందరినీ షాక్ కి గురయ్యేలా చేసింది.
సల్మాన్ ఖాన్ ఆ ప్రోగ్రాం లో ఈ విధంగా చెప్పుకొచ్చాడు. తాను స్కూల్ అండ్ జైలులో ఉన్నప్పుడు టాయిలెట్స్ ని శుభ్రం చేసానని చెప్పాడు. సల్మానే స్వయంగా అలా చెప్పేసరికి అక్కడున్న వాళ్ళందరూ ఒక్కసారిగా షాక్ కి గురయ్యారు.పైగా అలా చేసేటప్పుడు నామోషీగా కూడా ఫీల్ అవ్వలేదని , మన పని మనం చేసుకోవడంలో ఎలాంటి తప్పులేదనే ఒక చిన్న గీతోపదేశం కూడా ఇచ్చాడు. సల్మాన్ ఖాన్ కృష్ణ జింకని వేటాడిన కేసులో మరియు హిట్ అండ్ రన్ కేసు లో కొన్ని రోజులు జైలు శిక్ష అనుభవించిన విషయం అందరికీ తెలిసిందే. ఆ సమయంలోనే సల్మాన్ టాయిలెట్స్ ని శుభ్రం చేసి ఉంటాడని అందరూ అనుకుంటున్నారు.