కాశ్మీర షా అంటే బాలీవుడ్లో తెలియనివారుండరు. హిందీతో పాటు తెలుగు, తమిళ్, భోజపురి, మరాఠీ భాషల్లో మంచి నటిగా గుర్తింపు పొందింది. ‘బిగ్‌బాస్ 1’, ‘నాచ్ బలియే 3’, ‘ఫియర్ ఫ్యాక్టర్: ఖత్రోన్ కే ఖిలాడీ’ వంటి షోస్‌లో కంటెస్టెంట్‌గా కూడా పాల్గొంది.
కాశ్మీర షా అంటే బాలీవుడ్లో తెలియనివారుండరు. హిందీతో పాటు తెలుగు, తమిళ్, భోజపురి, మరాఠీ భాషల్లో మంచి నటిగా గుర్తింపు పొందింది. ‘బిగ్‌బాస్ 1’, ‘నాచ్ బలియే 3’, ‘ఫియర్ ఫ్యాక్టర్: ఖత్రోన్ కే ఖిలాడీ’ వంటి షోస్‌లో కంటెస్టెంట్‌గా కూడా పాల్గొంది. 2003లో బ్రాడ్ లిట్టర్మాన్ను పెళ్లి చేసుకుంది. నాలుగు సంవత్సరాల తరువాత వారిద్దరు విడిపోయారు. 2013లో ప్రముఖ నటుడు, టీవీ హోస్ట్ అయిన కృష్ణ అభిషేక్‌ను పెళ్లి చేసుకుంది. ఈ జంటకు బాలీవుడ్లో మంచి గుర్తింపు ఉంది. కాశ్మీర షాకు పిల్లలంటే చాలా ఇష్టం అని ఎన్నో సందర్బాల్లో చెప్పుకొచ్చింది. అయితే ఈ సెలబ్రిటీ కపుల్ పిల్లలు పుట్టాడానికి 14 సార్లు ప్రయత్నించారట. అన్ని సార్లు ప్రయత్నించినా కానీ కానీ తల్లిని మాత్రం కాలేక పోయానని ఆవేదన వ్యక్తం చేసింది.
కానీ.. ఒక స్టార్ హీరో చెప్పడం వల్ల మేము తల్లి దండ్రులమయ్యామని, ఆ హీరో సలహాతో తమ జీవితమే మారిపోయిందని తెలిపింది. పిల్లల కోసం తాము పడిన కష్టాల గురించి ఓ ఇటర్య్వూలో వెల్లడించింది. అయితే ఇంతలో సల్మాన్ ఖాన్ మంచి సలహ ఇచ్చారట. అదే వారి కుటుంబంలో సంతోషాన్ని నింపిందని చెప్పింది. ‘సరో గసీ’ ద్వారా బిడ్డను ప్లాన్ చేసుకోమని కాశ్మీర షాకి సల్మాన్ ఖాన్ చెప్పాడట. దాదాపు నాలుగేళ్ల తర్వాత సరోగసీ ద్వారా ఇద్దరు పిల్లలకు తల్లిదండ్రులమయ్యాయని సంతోషం వ్యక్తం చేసింది.
సల్మాన్ ఖాన్ మంచి మనుసున్న వ్యక్తి అని, తన సలహా వల్లే మా ఫ్యామిలీలో సంతోషం నిడిందని, వారికి రుణ పడి ఉంటాం అని తెలిపింది. కాగా మరి కొందరేమో కాశ్మీర షా తన గ్లామర్ కోసమే సరోగసీని ఎంచుకుందని ట్రోల్స్ చేస్తున్నారు. కానీ అవన్నీ రూమర్స్ అని కొట్టిపారేసిందామె. మొత్తానికి సల్మాన్ వంటి స్టార్ హీరో సజెషన్ వల్ల కాశ్మీర షా ఇంట్లో పండుగ వాతావరణం నెలకొంది.