మహా రాష్ట్రలో అద్భుతం.. 3 నల్ల త్రాచులు ఒకేసారి పడగ విప్పి..

snake

పాములు అనగానే అందరికీ భయమే. కొందరైతే దానిని చూడగానే ఆమడ దూరం పరిగెడతారు. అందులోనూ త్రాచుపాము అయితే.. అదికూడా నల్లత్రాచు అయితే? ఇంక చెప్పక్కర్లేదు. ఆ పామును చూసిన మనిషి ముఖచిత్రాన్ని మనం ఇట్టే అంచనా వేసుకోవచ్చు. అలాంటి ఫొటో ఒకటి వైరల్‌ అవుతోంది. మహారాష్ట్ర అమరావతి జిల్లా హరిసల్‌లో జరిగింది ఈ ఘటన. జనావాసాల్లోకి వచ్చిన మూడు నాగు పాములను అడవిలో వదిలిపెట్టినట్లు చెప్తున్నారు.

ఆ సమయంలో ఆ మూడు నల్ల త్రాచులు ఒకే చెట్టుకు పెనవేసుకుని కనిపించాయి. ఆ దృశ్యాలను ఫొటో తీశారు. ఆ ఫొటోలను ఒక అటవీ అధికారి తన ట్విట్టర్‌ ఖాతాలో పోస్ట్‌ చేశారు. కార్తిక మాసం కావడం. శివారధకులకు నాగుపాములంటే భక్తి దృష్ట్యా ఈ ఫొటోలు ఇప్పుడు సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి. ఇది సాధారణ దృశ్యం కాదని. కార్తిక మాసంలో ఆ పరమ శివుడి మహిమే అయి ఉంటుందని కొందరు భావిస్తున్నారు. ఎందు కంటే ఒక నల్ల త్రాచు కనపడటమే అరుదు అయితే.. అలాంటిది మూడు ఒకే చోట కనిపించే సరికి అందరూ ఇది ఆ శివయ్య మహిమే అంటూ కామెంట్‌ చేస్తున్నారు.