తూర్పుగోదావరి- మాజీ మంత్రి, తెలుగు దేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నారా లోకేష్ అప్పుడప్పుడు నోరు జారుతుంటారు. ప్రత్యర్ధి పార్టీపై విమర్శలు గుప్పించబోయి, సొంత పార్టీపై సెటైర్లు వేస్తుంటాడు లోకేష్. అలా ఒఖటి రెండు కాదు, చాలా సందర్బాల్లో మాట జారి నవ్వులపాలయ్యారు లోకేష్.
ఇదిగో ఇక్కడ మరోసారి మాట తడబడి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా కార్యకర్తలకు చిక్కేశారు. తూర్పుగోధావరి జిల్లాలో పర్యటించిన నారా లోకేష్, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలను ఉద్దేశించి ఆవేశంగా మాట్లాడారు. ఐతే ఈ క్రమంలో లోకేష్ తడబడ్డారంటూ వైసీపీతో పాటు ఇతర పార్టీ నేతలు సోషల్ మీడియా వేదికగా ఓ రేంజ్‌లో ట్రోలింగ్ చేస్తున్నారు.
ఏపీ సీఎం వైఎస్ జగన్ పై మండిపడుతున్న క్రమంలో.. అన్న ఎన్టీఆర్ మనవడిగా నేను మీ ముందల నిలబడట్లేదు.. ఆయన ఏ ఆశయాలతో పార్టీ స్థాపించారో.. ఆ ఆశయాల నాశనానికి నేను ఇవాళ ముందలకి వచ్చా.. అంటూ లోకేష్ తడబడ్డారని ఓ వీడియో సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది.
ఎన్టీఆర్ ఆశయాలు సాధించేందుకు వచ్చాను అని చేప్పాల్సిన లోకేష్, ఎన్టీఆర్ ఆశయాలను నాశనం చేసేందుకే వచ్చానంటూ నోరుజారారంటూ వైసీపీ శ్రేణులు పెద్ద ఎత్తున ట్రోలింగ్ మొదలుపెట్టాయి. లోకేష్ కు సంబందించి ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. మరి ఇది నిజంగానే జరిగిందా, లేక పాత వీడియోనా అన్నదే సందిగ్దంగా ఉంది.
మత పిచ్చి,కులపిచ్చి ఉన్న పార్టీ తెలుగు దేశం అని నిజాన్ని నిర్భయం గా చెప్పిన మా లోకం బాబు గారి నోటి నుండి జాలువారిన మరొక పచ్చి నిజం….
వినండి… పది మందికి వినిపించి, తరించండి.
వారి మాతామహులైన స్వర్గీయ నందమూరి తారక రామారావు గారి ఆశయాలను నాశనం చేయడానికే మన ముందుకు వచ్చారట pic.twitter.com/SPEoumPNPg
— թɾαѵҽҽղ ° (@praveen_ycp) July 28, 2021