‘మా’ నూతన కార్యవర్గం.. వచ్చిన ఓట్లు

ఫిల్మ్ డెస్క్- తెలుగు మూవీ ఆర్టిస్ట్ అసోషియేషన్ ఎన్నికల ప్రక్రియ ఎట్టకేలకు ముగిసింది. అయినప్పటికీ ‘మా’ లో మాటల యుధ్దం మాత్రం ఆగడం లేదు. ఆదివారం జరిగిన ‘మా’ ఎన్నికలలో మంచు విష్ణు విజయం సాధించిన విషయం తెలిసిందే. మంచు విష్ణుతో పాటు అతని ప్యానల్‌ లో వైస్ ప్రెసిడెంట్‌గా మాదాల రవి, జనరల్ సెక్రటరీగా రఘుబాబు, జాయింట్ సెక్రటరీగా గౌతం రాజు, ట్రెజరర్‌గా శివబాలాజీలతో పాటు ఈసీ మెంబర్స్ 10 మంది గెలుపొందారు.

ఇక ప్రకాశ్ రాజ్ ఓడిపోగా, ఆయన ప్యానల్‌లో ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్‌గా శ్రీకాంత్, వైస్ ప్రెసిడెంట్‌గా బెనర్జీ, జాయింట్ సెక్రటరీగా ఉత్తేజ్‌లతో పాటు ఈసీ మెంబర్స్ 8 మంది గెలుపొందారు. మొత్తంగా ‘మా’ నూతన కార్యవర్గంకు సంబంధించి గెలిచిన వారు, వారికి వచ్చిన ఓట్ల వివరాలు ఇలా ఉన్నాయి.

MAA elections 2021 1

‘మా’ నూతన కార్యవర్గం.. ‘మా’ అధ్యక్షుడిగా మంచు విష్ణు గెలుపొందారు. ఆయనకు మొత్తం 383 ఓట్లు వచ్చాయి. ‘మా’ ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ నటుడు శ్రీకాంత్ గెలుపొందగా, ఆయనకు 275 ఓట్లు వచ్చాయి. వైస్ ప్రెసిడెంట్స్ గా మాదాల రవి 376 ఓట్లతో గెలుపొందగా, క్యారెక్టర్ ఆర్టిస్ట్ బెనర్జీ 298 ఓట్లతో గెలుపొందారు. ‘మా’ జనరల్ సెక్రటరీ నటుడు రఘుబాబు 341 ఓట్లతో గెలిచారు.

జాయింట్ సెక్రటరీలుగా ఉత్తేజ్ 333 ఓట్లతో, గౌతంరాజు 322 ఓట్లతో విజయం సాధించారు. ‘మా’ ట్రెజరర్ శివబాలాజీ 360 ఓట్లతో గెలిచారు.

‘మా’ ఎగ్జిక్యూటివ్ కమిటీ సభ్యులుగా గెలిచిన వారు..

1. శివారెడ్డి (362)

2. గీతాసింగ్ (340)

3. అశోక్ కుమార్ (336)

4. బ్రహ్మాజీ (334)

5. శ్రీలక్ష్మి (330)

6. సి.మాణిక్ (326)

7. ఈటీవీ ప్రభాకర్ (319)

8. తనీష్ (306)

9. ఘర్షణ శ్రీనివాస్ (296)

10. హరినాధ్ బాబు (296)

11. సురేష్ కొండేటి (294)

12. శివన్నారాయణ (290)

13. సంపూర్ణేష్ బాబు (285)

14. జి.ఎస్. శశాంక్ (284)

15. సమీర్ (282)

16. సుడిగాలి సుధీర్ (279)

17. బొప్పన విష్ణు (271)

18. కౌశిక్ (269)

ఒకటి రెండు రోజుల్లో ‘మా’ నూతన కార్యవర్గం తొలి సమావేశాన్ని నిర్వహించే అవకాశం ఉందని తెలుస్తోంది.