కొన్ని రోజుల క్రితం కోతులు-కుక్కలకు మధ్య జరిగిన గ్యాంగ్ వార్ దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారిన సంగతి తెలిసిందే. తాజాగా ఈ కోవకు చెందిన సంఘటన మరొకటి వెలుగులోకి వచ్చింది. ఈ సారి ఓ చిన్నారిపై పగ పట్టిన కోతులు.. ఆఖరికి ఆ పసివాడి ఉసురు తీశాయి. ఈ విషాదకర సంఘటన ఉత్తరప్రదేశ్ మీరట్ లో చోటు చేసుకుంది. కోతుల గుంపు రెండు నెలల చిన్నారిని ఎత్తుకెళ్లి వాటర్ ట్యాంక్ లో పడేశాయి. ఈ ఘటనలో చిన్నారి మృతి చెందాడు. ఆ వివరాలు..
ఉత్తర్రప్రదేశ్ మీరట్‌లోని బాగ్పాట్ కు చెందిన కోమల్, ప్రిన్స్ భార్యాభర్తలు. వీరికి రెండు నెలల క్రితం కేశవ్ కుమార్ అనే చిన్నారి జన్మించాడు. ఈ క్రమంలో ఆదివారం కేశవ్ నాయనమ్మ.. చిన్నారిని తన పక్కనే పడుకోబెట్టుకుని.. నిద్రలోకి జారుకుంది. ఆ సమయంలో ఆమె ఇంటి తలుపు పెట్టడం మర్చిపోయింది. ఇది గమనించిన కోతులు.. ఇంట్లో ప్రవేశించి.. నాయనమ్మ పక్కన నిద్రిస్తున్న కేశవ్ ని ఎత్తుకెళ్లాయి. ఈ క్రమంలో చిన్నారి భయపడి గుక్కపట్టి ఏడవ సాగాడు.
ఇది కూడా చదవండి : కుక్కలపై పగబట్టిన కోతులు.. 250 కుక్కలను చంపిన వానరాలుకేశవ్ ఏడ్పు విన్న చిన్నారి నాయనమ్మ నిద్ర నుంచి మేల్కోని.. తన ఎదురుగా ఉన్న దృశ్యాన్ని చేసి బిగుసుకుపోయింది. కోతుల చెర నుంచి మనవడిని కాపాడేందుకు విశ్వ ప్రయత్నాలు చేసింది. కానీ అప్పటికే కోతులు.. చిన్నారిని తమతో లాక్కెళ్లి.. గ్రామంలోని నీళ్ల ట్యాంక్ లో పడేశాయి. విషయం తెలిసిన గ్రామస్తులు.. కేశవ్ ని కాపాడేందుకు ట్యాంక్ మీదకు ఎక్కారు. అప్పటికే చిన్నారి చనిపోవడమే.. బాలుడి మృతదేహం నీటిపై తేలసాగింది.
కేశవ్ తల్లిదండ్రులు జరిగిన దారుణాన్ని ఇంకా జీర్ణించుకోలేకపోతున్నారు. అంతేకాక ఇక్కడ మరో ఆసక్తికర విషయం వెలుగు చూసింది. కొన్ని రోజుల క్రితం ఇలానే ఓ సారి కోతులు కేశవ్ ని లాక్కెళ్లేందుకు ప్రయత్నించాయి.. కానీ బాలుడి తల్లిదండ్రులు అడ్డుకోవడంతో.. క్షేమంగా బయటపడగలిగాడు. కానీ ఈ సారి వారి బిడ్డను కాపాడుకోలేకపోయారు. కేశవ్ మృతి పట్ల గ్రామస్తులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కోతుల బెడద గురించి ఇప్పటికే పలు మార్లు.. అధికారులకు ఫిర్యాదు చేశామని.. కానీ ఫలితం లేదని.. చివరకు పసిబిడ్డ ప్రాణం పోయే పరిస్థితి తలెత్తిందని తెలిపారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి.. కోతుల సమస్యను పరిష్కరించాలని కోరుతున్నారు. ఈ దారుణంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.