దేశం కాని దేశానికి వచ్చి 30 ఏళ్ళనాటి అప్పు తీర్చిన కెన్యా ఎం.పీ.!.

చేసిన సాయాన్ని మర్చిపోతున్న రోజులివి. నమ్మినోళ్లను నట్టేట ముంచుతున్న పాడు కాలం. అలాంటివేళ అప్పుడెప్పుడో 30 ఏళ్ల క్రితం తాను చేసిన అప్పును గుర్తు పెట్టుకొని మరీ తీర్చేందుకు దేశం కాని దేశానికి వచ్చిన  వైనం ఇప్పుడు అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. అయితే ఒకటి కాదు రెండు కాదు ముప్ఫై ఏళ్ల తర్వాత తన రుణం తీర్చడం పెద్ద మొత్తం ఇచ్చేశాడు.
తీసుకున్న అప్పును తిరిగి చెల్లించడానికి చాలామంది చాలా కష్టంగా భావిస్తుంటారు. తీసుకున్నప్పుడు ఎంతో ఆనందంగా తీసుకుని, తిరిగి ఇవ్వాల్సి వచ్చేటప్పుడు చాలా బాధపడిపోతుంటారు. అప్పటికప్పుడు కాకపోయిన కాస్త ఆలస్యంగానైనా, వీలైతే ఒక జీవిత కాలం ఆలస్యంగానైనా అప్పును చెల్లించి విముక్తులు అవుతుంటారు. అలాంటి కోవలోకే వస్తాడు – కెన్యా ఎం.పీ. రిచర్డ్ టోంగీ. ఆయన ఎప్పుడో 20 ఏళ్ల క్రితం బకాయి పడిన రూ.200 తీర్చడం కోసం ఖండాలు దాటుకుంటూ ఏకంగా 5వేల కిలోమీటర్లు ప్రయాణించి మరీ వచ్చాడు. తాను బకాయి పడ్డ కిరాణా వ్యాపారి ఇంటికి వెళ్లి విషయం చెప్పడంతో వారు ఆశ్చర్యపోయారు.

bn 4821258 835x547 m


కెన్యా కు చెందిన రిచర్డ్ టోంగీ ఔరంగాబాద్ లో చదువుకున్నాడు. ఆ సమయంలో స్థానిక కిరాణా వ్యాపారి వద్ద తనకి కావల్సిన నిత్యావసరాలన్ని అతని దగ్గరే కొనేవాడు. రిచర్డ్స్ తో షాప్ ఓనర్ గవాలీ కి మంచి పరిచయం ఏర్పడింది. అలా నాలుగేళ్ళు అతనిదగ్గరే సరుకులు కొన్నాడు రిచర్డ్స్. అలా కొన్నాళ్లకి అనుకోకుండా హఠాత్తుగా తన దేశం వెళ్లిపోవాల్సి వచ్చింది రిచర్డ్స్ కి. ఇది జరిగి 20 ఏళ్లు అయింది.. ఒకరోజు చదువుకున్న రోజుల్లో జరిగిన సంఘటనలు… జమా ఖర్చులు చూసుకుంటూ ఉండగా తాను ఇండియాలో గవాలీకి అప్పు ఉన్న సంగతి గుర్తొచ్చింది. దాంతో అతను ఎలాగైనా ఇండియా వచ్చి గవాలీ అప్పు తీర్చాలని దేవుళ్లకి మొరపెట్టుకునేవాడు రిచర్డ్స్. ప్రస్తుతం ఆయన అక్కడ ఎంపీగా ఎన్నికయ్యాడు. తన పాత బకాయి రూ.200 మరచిపోలేదు. ఆ అప్పు తిరిగి చెల్లించడం కోసం ఔరంగాబాద్ రావాలని నిర్ణయించుకున్నాడు. ఇటీవల భారత ప్రధాని మోదీని కలవడానికి కెన్యాకు వచ్చిన భారత ఎంపీల బృందంతోపాటు తనూ వచ్చాడు. అధికార పనులు పూర్తయ్యాక ఔరంగాబాద్ వెళ్లి గవాలీ అడ్రస్ కనుక్కున్నాడు. వ్యాపారి ఇంటికి వెళ్లారు. తాను బకాయి ఉన్న సంగతిని గుర్తుచేసి ఆ సొమ్ము ఇవ్వబోయాడు. దీంతో భావోద్వేగానికి గురైన గవాలీ కుటుంబ సభ్యులు తమ కోసం ఎక్కడ నుంచో వచ్చిన ఆత్మీయ అతిథికి చక్కని ఆతిథ్యం ఇచ్చారు. వారి మర్యాదలకు టోంగీ కూడా ఫిదా అయ్యాడు. వారిని ఎప్పటికీ మరచిపోలేనని, గవాలీ కుటుంబంతో స్నేహసంబంధాలు కొనసాగిస్తానని చెప్పాడు. రిచర్డ్స్ ఆనాడు తీసుకున్న రూ. 200లకు బదులుగా 250 యూరో లను మన రూపాయల్లో 19,200 గవాలీకు చెల్లించారు. తర్వాత అతని కుటుంబ సభ్యులతో కలసి ఫోటో కూడా తీయించుకున్నాడు.