మహమ్మారి సమయంలో ఎక్కువ గంటలు పనిచేయడం పెద్ద సమస్యగా మారింది. ఇంట్లోనే ఉండి పనిచేయడం వల్ల పనిభారం బాగా పెరిగిందని, ముఖ్యంగా పురుషులపై ఇది ఎక్కువగా ఉందని ప్రపంచ ఆరోగ్య సంస్థ తెలిపింది. పశ్చిమ పసిఫిక్, ఆగ్నేయాసియా ప్రాంతాల్లో నివసించే మధ్య వయస్కులు, వృద్ధుల్లో దీని ప్రభావం ఎక్కువగా ఉందని చెప్పింది. ఇంకా, 45-75 సంవత్సరాల వయసు వారిలో 60 పైబడ్డ వారు వారానికి 55 గంటల కంటే ఎక్కువ పని చేయడం వల్ల గుండెపోటు వంటి […]
చేసిన సాయాన్ని మర్చిపోతున్న రోజులివి. నమ్మినోళ్లను నట్టేట ముంచుతున్న పాడు కాలం. అలాంటివేళ అప్పుడెప్పుడో 30 ఏళ్ల క్రితం తాను చేసిన అప్పును గుర్తు పెట్టుకొని మరీ తీర్చేందుకు దేశం కాని దేశానికి వచ్చిన వైనం ఇప్పుడు అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. అయితే ఒకటి కాదు రెండు కాదు ముప్ఫై ఏళ్ల తర్వాత తన రుణం తీర్చడం పెద్ద మొత్తం ఇచ్చేశాడు.తీసుకున్న అప్పును తిరిగి చెల్లించడానికి చాలామంది చాలా కష్టంగా భావిస్తుంటారు. తీసుకున్నప్పుడు ఎంతో ఆనందంగా తీసుకుని, […]
కరోనా రెండో దశ ఉద్ధృతితో దేశంలో ఆక్సిజన్ కొరత తీవ్రమైంది. దేశంలో కరోనా పాజిటివ్ కేసులు పెరుగుతుండటంతో ఆస్పత్రులన్ని రోగులతో నిండిపోయాయి. సరైన ఆక్సిజన్ లభించని పరిస్థితి నెలకొంది. ఆక్సిజన్ కొరత తీర్చేందుకు వివిధ దేశాలు సైతం భారత్‌కు అండగా నిలిచాయి. ఆక్సిజన్, మెడికల్ కిట్లు, మందులు, కరోనా పరీక్షలకు సంబంధించిన కిట్లు, వెంటిలేటర్ పరికరాలను భారత్‌కు పంపించాయి. రోగులకు ప్రాణవాయువు అందించేందుకు వాయుసేన వివిధ దేశాల నుంచి ఆక్సిజన్ ట్యాంకర్లను ప్రత్యేక విమానాల ద్వారా మోసుకొచ్చాయి.ఈ […]
నల్లని వలయాలతో నిస్తేజంగా ఉన్న కళ్లు ముఖ అందాన్ని పోగొట్టడమే కాదు, మనం తీవ్ర ఒత్తిడిలోనో, ఏదైనా ఆరోగ్యసమస్యతోనో ఉన్నామనే విషయాన్ని బహిర్గతం చేస్తాయి. కలువల్లాంటి కళ్లకింద నల్లటి చారికలు ఎందుకు ఏర్పడతాయి? ఆ చారికలపైన సనసన్నని కురుపులు ఎందుకు వస్తాయి? ఎంతో సున్నితంగా ఉండే ఐ స్కిన్ గరుకుగా ఎందుకు తయారవుతుంది? ఈ వలయాలను ఏవిధంగా పోగొట్టుకోవచ్చు? వయసు పెరుగుతోంది అని సూచించే మొదటి లక్షణం కనపడగానే, అంటే స్కిన్ డ్రై గా అయిపోవడం వంటిది, […]