అరుదైన గుండె ఆపరేషన్ చేశారు కాంటినెంటల్ ఆస్పత్రి వైద్యులు. ఇలాంటి శస్త్రచికిత్స చేయడం దేశంలో ఇదే తొలిసారి అని తెలుస్తోంది. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు..
ప్రస్తుత రోజుల్లో టెక్నాలజీ వినియోగం బాగా పెరిగింది. సాంకేతికతలో వస్తున్న అధునాతన మార్పులను అన్ని రంగాల వారు అందిపుచ్చుకుంటున్నారు. టెక్నాలజీ వాడకంతో చాలా రంగాల్లో అనూహ్య మార్పులు వచ్చేశాయి. దీనికి ఆరోగ్య రంగం మినహాయింపేమీ కాదు. ఎన్నో ప్రాణాలను కాపాడేందుకు టెక్నాలజీ సాయాన్ని తీసుకుంటున్నారు వైద్యులు. తాజాగా అలాంటి ఓ ఘటనే తెలంగాణ రాజధాని హైదరాబాద్‌లో చోటుచేసుకుంది. దేశంలోనే మొదటిసారిగా ఒక వైద్య రోబో అనుసంధానంతో ఓ రోగికి గుండె ఆపరేషన్ జరిగింది. గచ్చిబౌలిలోని కాంటినెంటల్ ఆస్పత్రి డాక్టర్లు ఈ ఆపరేషన్‌ను సక్సెస్‌ఫుల్‌గా నిర్వహించి హిస్టరీ క్రియేట్ చేశారు. సాధారణ హార్ట్ ఆపరేషన్స్‌కు భిన్నంగా అత్యాధునిక రోబో అనుసంధానంతో గుండె ఆపరేషన్ చేయడం కీలకమైన ముందడుగుగానే చెప్పాలి.
గతంలో రెండుసార్లు యాంజియోప్లాస్టీ చేయించుకున్న ఒక 36 ఏళ్ల రోగికి కాంటినెంటల్ హాస్పిటల్ కార్డియో థొరాసిక్ వాస్క్యులర్ సర్జన్ డాక్టర్ ప్రదీప్ రాచకొండ నేతృత్వంలో విజయవంతంగా ఈ సర్జరీ చేశారు. ఈ వైద్యుల బృందానికి ఎస్ఎస్ ఇన్నోవేషన్ సంస్థ ఛైర్మన్, డాక్టర్ సుధీర్ శ్రీవాస్తవ మార్గదర్శకత్వం చేశారు. ఈ ఆపరేషన్ సక్సెస్ అయిన విషయాన్ని కాంటినెంటల్ ఆస్పత్రి ఛైర్మన్, ఎండీ డాక్టర్ గురు ఎన్.రెడ్డి ఓ ప్రకటనలో తెలిపారు. ఈ సర్జరీని వైద్యశాస్త్రంలో ఒక ముందడుగుగా ఆయన అభివర్ణించారు. రోగికి అతితక్కువ బాధ, తక్కువ ఇబ్బందితో సర్జరీ చేయగలగడం ఈ విధానం ప్రత్యేకత అని పేర్కొన్నారు. ఈ సక్సెస్ దేశానికి, అలాగే తెలంగాణకు గర్వకారణంగా వెలుగొందుతుందని గురు ఎన్.రెడ్డి వివరించారు.
Continental #Hospitals, #Hyderabad successfully performed 1st #robot-assisted CABG procedure in India on a 36-year-old patient with coronary #heart disease.
This surgery marks another huge leap in adoption of robot-assisted techniques to improve surgical-outcomes &… pic.twitter.com/Gzcpu5mZCH
— Mirror Now (@MirrorNow) April 7, 2023