జులై 23 నుంచి ఆగస్టు 8 వరకు టోక్యో వేదికగా ఒలింపిక్స్ జరగనున్నాయి. కరోనా వైరస్ నేపథ్యంలో 2020లో జరగాల్సిన ఒలింపిక్ క్రీడలు వాయిదాపడి ఈ ఏడాది నిర్వహిస్తున్నారు.14 క్రీడా విభాగాలకు మొత్తం 102 మంది భారతీయ అథ్లెట్లు టోక్యో ఒలింపిక్స్ కోసం అర్హత సాధించారు. టోక్యో ఒలింపిక్స్ క్రీడల్లో బంగారు పతక విజేతలకు రూ.3కోట్ల బహుమతి ఇవ్వాలని ఢిల్లీ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. టోక్య ఒలింపిక్స్ క్రీడల్లో పాల్గొనడానికి ఢిల్లీకి చెందిన నలుగురు అథ్లెట్లు ఎంపికయ్యారు. […]
తమిళనాడు సీఎం స్టాలిన్ ఆదేశాలతో తమిళనాడు పోలీసులు కో వ్యాక్సిన్, ఆక్సిజన్ సిలిండర్లు బ్లాక్ మార్కెట్ లో విక్రయించే వారి పనిపట్టడానికి రంగంలోకి దిగారు. ప్రజల ప్రాణాలతో కూడా వ్యాపారం చెయ్యాలని ప్రయత్నిస్తున్న కేటుగాళ్ల భరతం పట్టాలని సీఎం ఎంకే. స్టాలిన్ ఆదేశాలు జారీ చెయ్యడంతో పోలీసులతో పాటు డీఎంకే పార్టీ నాయకులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యమంత్రి ఆదేశాలతో వసూలు చేసిన జరిమానాను పోలీసులు బాధితుడి ఇంటికే వెళ్లి అందజేశారు. మేము ఆక్సిజన్ కూడా బ్లాక్ […]
చేసిన సాయాన్ని మర్చిపోతున్న రోజులివి. నమ్మినోళ్లను నట్టేట ముంచుతున్న పాడు కాలం. అలాంటివేళ అప్పుడెప్పుడో 30 ఏళ్ల క్రితం తాను చేసిన అప్పును గుర్తు పెట్టుకొని మరీ తీర్చేందుకు దేశం కాని దేశానికి వచ్చిన వైనం ఇప్పుడు అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. అయితే ఒకటి కాదు రెండు కాదు ముప్ఫై ఏళ్ల తర్వాత తన రుణం తీర్చడం పెద్ద మొత్తం ఇచ్చేశాడు.తీసుకున్న అప్పును తిరిగి చెల్లించడానికి చాలామంది చాలా కష్టంగా భావిస్తుంటారు. తీసుకున్నప్పుడు ఎంతో ఆనందంగా తీసుకుని, […]
కరోనా విజృంభణ,లాక్ డౌన్ నేపథ్యంలో ఉపాధి కోల్పోయి ఇబ్బందులెదుర్కొంటున్న పేదలకు ఆర్థిక తోడ్పాటు అందించాలని ఢిల్లీ ప్రభుత్వం నిర్ణయించింది. ఢిల్లీలోని ఆటోవాలాలు, ట్యాక్సీ వాలాలకు రూ.5000 చొప్పున వారి వారి అకౌంట్లలో వేయనున్నట్లు ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ మంగళవారం ప్రకటించారు. ఆటో, టాక్సీ డ్రైవర్లకు 5 వేలరూపాయల ఆర్ధిక సహాయం ఇవ్వాలని నిర్ణయించింది. సాధ్యమైనంత త్వరగా ఈ సాయాన్ని అందజేస్తామని ఆయన మంగళవారం ప్రకటించారు. దీనివల్ల వారు కొంతవరకైనా తమ ఆర్ధిక నష్టాల నుంచి బయటపడతారని […]