ఊపిరి బిగబట్టేలా చేసిన ఉయ్యాల సరదా!..

ఇంట్లో, పొలాల వద్ద, చెట్టుకు తాడు కట్టుకొని ఉయ్యాల ఊగూతుంటే మహా సరాదాగా ఉండేంది. ఒక్కసారి ఉయ్యాలపై కూర్చొని ఊగుతుంటే వయసుని మర్చిపోయి మనసు ప్రశాంతంగా ఉంటుంది. అయితే అదే ఉయ్యాల సరదా తాజాగా ఇద్దరు యువతుల ప్రాణాల మీదకు తీసుకొచ్చింది. ఉయ్యాలపై జాలీగా గడిపేందుకు వచ్చిన ఇద్దరు యువతులు మృత్యువు అంచుల దాకా వెళ్లొచ్చారు.

two womens fell in valley01 minఇద్దరు యువతులు ఉయ్యాల ఎక్కగా మరో వ్యక్తి ఆ ఉయ్యాలను బలంగా ఊపాడు. మూడు సార్లు అంతే బలంగా ఊపాడు. నాలుగోసారి కూడా ఊపాడు. ఉయ్యాల ఎక్కి చక్కగా ఊగుతున్న సమయంలో లోతును చూసి ఒక్కసారిగా భయపడ్డారు. దీంతో ఉయ్యాల కదులుతుండగానే దాని నుంచి హడావిడిగా దిగేందుకు ప్రయత్నించారు. ఇంకేముంది సరాసరి ఉయ్యాల పక్కన ఉన్న 6300 అడుగుల లోయలోకి పడిపోయారు.

రష్యాలోని డగేస్టన్‌ – సులాక్ కాన్యాన్‌ ప్రాంతంలో పర్యాటకుల కోసం కొండ అంచున ఒక ఉయ్యాలను అధికారులు ఏర్పాటు చేశారు. దీంతో పర్యాటకులు ఉయ్యాలలో కూర్చొని సరికొత్త అనుభూతిని పొందుతున్నారు. అయితే ఉయ్యాల వద్ద భద్రత సరిగా లేదని అక్కడి ప్రభుత్వం హెచ్చరించిన అధికారులు పట్టించుకోలేదు.

వారు కొండ అంచున ఏర్పాటు చేసిన డెక్కింగ్ ప్లాట్‌ఫాం మీద పడటంతో ప్రాణాలు దక్కాయి. ఒకవేళ ఉయ్యాల బాగా ఎత్తులో ఉన్నప్పుడు ఈ ఘటన జరిగి ఉంటే లోయలో పడటంతోపాటు వారి ప్రాణాలకు ముప్పు వాటిల్లేది.  ఆ ఉయ్యాలకు తగిన భద్రతా ఏర్పాట్లు లేవని, అందుకే మహిళలు పడిపోయారని డాగేస్టాన్‌ పర్యాటక మంత్రి తెలిపారు.

ఈ ఘటనపై దర్యాప్తు జరుపడంతోపాటు పర్యాటకుల ప్రాణాలకు ఎలాంటి హాని కలుగకుండా తగిన జాగ్రత్తలు తీసుకుంటామని చెప్పారు. మరోవైపు ఒళ్లు జలదరింపజేసే ఈ వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌ అయ్యింది.

ఊపిరి ఆగిపోయేలా ఉన్న ఈ వీడియో చూడండి: