ఇంట్లో, పొలాల వద్ద, చెట్టుకు తాడు కట్టుకొని ఉయ్యాల ఊగూతుంటే మహా సరాదాగా ఉండేంది. ఒక్కసారి ఉయ్యాలపై కూర్చొని ఊగుతుంటే వయసుని మర్చిపోయి మనసు ప్రశాంతంగా ఉంటుంది. అయితే అదే ఉయ్యాల సరదా తాజాగా ఇద్దరు యువతుల ప్రాణాల మీదకు తీసుకొచ్చింది. ఉయ్యాలపై జాలీగా గడిపేందుకు వచ్చిన ఇద్దరు యువతులు మృత్యువు అంచుల దాకా వెళ్లొచ్చారు. ఇద్దరు యువతులు ఉయ్యాల ఎక్కగా మరో వ్యక్తి ఆ ఉయ్యాలను బలంగా ఊపాడు. మూడు సార్లు అంతే బలంగా ఊపాడు. […]