ప్లాస్టిక్‌ దుస్తులు…సరికొత్త సృజనకు స్ఫూర్తి!..

ప్లాస్టిక్‌ కాలుష్యం పర్యావరణాన్ని తీవ్రంగా దెబ్బతీస్తోంది. లాగోస్‌ నగరం వాణిజ్య రాజధాని కావడంతో ఇక్కడ నివసించే జనాభాకు తగ్గట్టు ప్లాస్టిక్‌ వాడకం కూడా అధికంగా ఉంటుంది. దీంతో ప్లాస్టిక్‌ వ్యర్ధాలు చిన్న చిన్న డ్రైనేజీల నుంచి నదులు, సముద్రాల్లో నీటి ప్రవాహానికి అడ్డుపడుతూ  మరోపక్క నీటిపై చాపలా తేలుతున్నాయి. ఫలితంగా జలచరాల మనుగడకు ముప్పుగా పరిణమిస్తున్నాయి. రోజురోజుకి ఈ సమస్య పెరుగుతుందే కానీ తగ్గడంలేదు. నైజీరియాలోని లాగోస్‌ నగరానికి చెందిన కొంతమంది టీనేజర్లు ఎసోహి ఒజిగ్బో నాయకత్వంలో ఒక బృందంగా ఏర్పడి ప్లాస్టిక్‌ కాలుష్యాన్ని అరికట్టేందుకు పూనుకున్నారు. డస్ట్‌బిన్‌, డ్రైనేజీ నీళ్లల్లో తేలియాడే సింగిల్‌ యూజ్‌ ప్లాస్టిక్‌ వ్యర్ధాలను జాగ్రత్తలు పాటిస్తూ సేకరించి, ఉపయోగపడే వస్తువులు, ఫ్యాషనబుల్‌ దుస్తులను తయారు చేస్తున్నారు. దీనికి ఏదైనా పరిష్కారం కనుక్కోవాలని ఆలోచించారు. ఈ క్రమంలోనే సింగిల్‌ యూజ్‌ ప్లాస్టిక్‌ను సేకరించి శుభ్రంగా కడిగి వాటిని చిన్నచిన్న ముక్కలుగా కత్తిరించి ఫ్యాబ్రిక్‌ తో కలిపి కుట్టి మోడల్‌ వస్త్రాలు, బ్యాగులు రూపొందిస్తున్నారు.

trashionshow

రూపొందించిన వాటిని ప్రదర్శించేందుకు ట్రాషన్‌ షో మంచి వేదిక అయింది. ఈ ప్రపంచాన్ని మార్చగల శక్తి ఉంది. అందుకే స్వీడిష్‌ పర్యావరణ కార్యకర్త గ్రేటా థన్‌ బర్గ్‌ స్ఫూర్తితో పర్యావరణ పరిరక్షణకు కట్టుబడి ముందుకు సాగుతున్నామని చెప్పారు. ఒజిగ్బో బందం తయారు చేసిన దుస్తులను షాపింగ్‌ మాల్స్‌లో స్టేజ్‌ షోలను ఏర్పాటు చేసి ప్రమోట్‌ చేయడమేగాక, ట్రాషన్‌ షో నిర్వహించి ప్లాస్టిక్‌ ఫాషన్‌కు జీవం పోశారు. ఒజిగ్బో బృందంలో అంతా టీనేజర్లే అయినప్పటికీ పర్యావరణంపై వారికున్న అవగాహన, భవిష్యత్తు తరాలకోసం ఆరాటపడడం విశేషమని గ్రీన్‌ ఫింగర్స్‌ వైల్డ్‌ లైఫ్‌ అనే స్వచ్ఛంద సంస్థ వ్యవప్థాపకులు నినేడు మొగాంబో అభినందించారు.