రకుల్ ప్రీత్ సింగ్ పలు హిట్ చిత్రాల్లో నటించి స్టార్ హీరోయిన్ గా పేరు సంపాదించుకుంది. సోషల్ మీడియాలో హాట్ ఫొటో షూట్లతో అదరగొడుతూ అభిమానులను ఆకట్టుకుంటుంది. అయితే రీసెంట్ గా ఓ వేడుకలో తుళుకుమన్న ఆమె ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.
రకుల్ ప్రీత్ సింగ్ తన నటనతో అభినయంతో స్టార్ హీరోయిన్ గా పేరు తెచ్చుకుంది. ఆమె నటిగానే కాకుండా మోడలింగ్ లో కూడా రాణించింది. సినీ ఇండస్ట్రీలో దాదాపు అందిరి హీరోల సరసన నటించి మెప్పించింది. 1990 అక్టోబర్ 10న జన్మించిన రకుల్ మోడల్ గా కెరీర్ ఆరంభించింది. ఆ తరువాత సినిమాల్లోకి అడుగుపెట్టింది. తెలుగులోనే కాకుండా హిందీ, తమిళ్, కన్నడ చిత్రాల్లో నటించి నటిగా మంచి గుర్తింపు తెచ్చుకుంది. కాగా తాజాగా ఓ ఈవెంట్ కి హాజరైన ఆమె పింక్ సిండ్రెల్లా డ్రెస్ లో తళుకులీనింది. దివి నుంచి భువికి దిగివచ్చిన దేవకన్యలా ఉన్న రకుల్ ను చూసి ఆ వేడుకకు హాజరైనవారు మంత్రముగ్థులయ్యారు.
సినిమారంగంలో నటీనటుల జర్నీ వారు నటించే చిత్రాల సక్సెస్ పైననే ఆధారపడి ఉంటుంది. వారు నటించిన సినిమాలు విజయం సాధిస్తే అవకాశాలు వెతుక్కుంటూ వస్తాయి. లేదంటే సినిమా కెరియర్ ప్రమాదంలో పడే అవకాశముంటుంది. కానీ టాలీవుడ్ స్టార్ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ సక్సెస్, ఫెయిల్యూర్ తో సంబంధం లేకుండా సినీ రంగంలో అవకాశాలను అందిపుచ్చుకుంటూ, విభిన్న పాత్రలు చేస్తూ దూసుకెళ్తుంది. సమయం దొరికినప్పుడల్లా ఫోటో షూట్ చేస్తూ హాట్ ఫోజులతో కుర్రాళ్ల రాకుమారిగా మారింది. అయితే తాజాగా ఓ వేడుకకు హాజరైన రకుల్ ప్రీత్ సింగ్ స్టన్నింగ్ లుక్స్ తో ఆకట్టకుంది.
స్టార్ హీరోయిన్ గా ఎదిగిన రకుల్ ప్రీత్ సింగ్ నటిగానే కాకుండా బిజినెస్ లోను హీరోలతో పోటీపడుతోంది. ఫిట్ నెస్ పై రకుల్ ఎక్కువగా శ్రద్ద చూపుతారు. ఫిట్ నెస్ పై ఆమెకు ఉన్న అవగాహనతో ప్రముఖ నగరాల్లో ఫిట్ నెస్ సెంటర్లను ఏర్పాటు చేసి మంచి ఆదాయాన్ని గడిస్తున్నది. ఆ మధ్య బికినీలో మెరిసిన రకుల్ తాజాగా ఓ లాంగ్ ఫ్రాక్ ధరించి మరింత అందంగా కనిపించింది. గ్లామర్ డోస్ పెంచి ఎద అందాలతో ఫొటోలకు పోజులిచ్చింది. అవి నెట్టింట వైరల్ గా మారాయి. అయితే పింక్ సిండ్రెల్లా డ్రెస్ లో హొయలు పోతున్న రకుల్ ఆ వేడుకలో వేదికపైకి వెళ్లే సమయంలో మెట్లు ఎక్కుతున్నప్పుడు తన డ్రెస్ ను అసిస్టెంట్ ఎత్తి పట్టుకున్నాడు. దీంతో పలువురు నెటిజన్స్ అతడు గౌను అలా ఎత్తిపట్టుకోవడం బాలేదంటూ కామెంట్స్ చేస్తున్నారు. దీంతో ఆ వీడియో నెట్టింట వైరల్ గా మారింది.