తెరపైనే కాదూ తెర వెనుక కూడా తాను నిజమైన హీరో అని నిరూపిస్తున్నారు హాలీవుడ్ స్టార్ లియోనార్డో డికాప్రియో. టైటానిక్ సినిమాను చూసిన వారికి జాక్ గా ఆయన సుపరిచితం. అయితే ఇప్పడు ఆయన భారత్ కు రావాలంటూ అస్సాం ముఖ్యమంత్రి హిమంత విశ్వ శర్మ ఆహ్వానం పంపారు. ఎందుకంటే.?
హాలీవుడ్ స్టార్ లియోనార్డో డికాప్రియో తెలుసా అంటే కొంత మంది సమాధానం చెప్పగలరు. అదే టైటానిక్ హీరో అనగానే చాలా మంది గుర్తు పట్టేస్తారు. ప్రముఖ దర్శకుడు జేమ్స్ కెమరూన్ తెరకెక్కించిన అమర ప్రేమ కావ్యమే ఈ టైటానిక్. ఇందులో నటించిన హీరో, హీరోయిన్లు లియోనార్డో డికాప్రియో, కేట్ విన్‌స్లేట్లు అద్భుతమైన నటన కనబర్చారు. ఆ సినిమాలో పడవ మునిగి, జాక్ పాత్రధారి అయిన మన హీరో చనిపోతున్న సన్నివేశాన్ని చూసి ఎంత మంది చలించిపోయారో. ఆ సినిమాతోనే ఆయనకు అంతర్జాతీయ గుర్తింపు వచ్చింది. తర్వాత ఎన్ని సినిమాలు చేసిన భారతీయులకు మాత్రం టైటానిక్ హీరోగానే గుర్తుండిపోతారు. అయితే ఆయన భారత్ కు రావాలంటూ అస్సాం సీఎం హిమంత విశ్వ శర్మ ఆహ్వానించారు.
ప్రపంచ వ్యాప్తంగా పర్యావరణ సంబంధిత అంశాలపై కుండ బద్దలు కొట్టినట్లు మాట్లాడే డికాప్రియో.. తాజాగా అంతరించిపోతున్న ఒంటి కొమ్ము ఖడ్గ మృగాల గురించి ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ పోస్టు పెట్టారు. ఒంటి కొమ్ము ఖడ్గ మృగాల సంరక్షణ కోసం అస్సాం ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను గురించి ఆయన మెచ్చుకున్నారు. ‘2000 నుంచి 2021 మధ్యకాలంలో 190 ఖడ్గమృగాలను కేవలం కొమ్ముల కోసం చంపేశారు. కజిరంగా నేషనల్ పార్క్‌లో వాటిని వేటాడకుండా చూసేందుకు 2021లో అస్సాం ప్రభుత్వం చర్యలు తీసుకుంది. 2022లో ప్రభుత్వం ఆ లక్ష్యాన్ని చేరింది. 1977 తర్వాత ఆ ప్రాంతంలో తొలిసారిగా ఒక్క ఖడ్గమృగాన్ని కూడా వేటాడలేదు’ అని పేర్కొన్నారు.
ఇప్పుడు కజిరంగా నేషనల్ పార్కులో 2200 ఒంటి కొమ్ము ఖడ్గ మృగాలకు ఆవాసంగా నిలిచిందని, వీటి జనాభాలో మూడింట రెండింతలు ఇక్కడే ఉన్నాయన్నారు. డికాప్రియో పోస్టుపై స్పందించిన అస్సాం సీఎం హిమంత స్పందించారు.‘ మీ అభిమానానికి ధన్యవాదాలు. వన్యప్రాణులను సంరక్షించడం మన సాంస్కృతిక గుర్తింపులో అంతర్భాగం. మన సుసంపన్నమైన వారసత్వాన్ని కొనసాగించేందుకు మేమంతా అంకిత భావంతో ఉన్నాం. అదేవిధంగా మీరు కజిరంగా నేషనల్ పార్కును సందర్శించాలని ఆహ్వానిస్తున్నా’ అంటూ పేర్కొన్నారు. ఆయన ఆహ్వానాన్ని మన్నించి డికాప్రియో వస్తారేమో చూడాలి. సినిమా తెరపైనే కాకుండా నిజ జీవితంలో పర్యావరణ పరిరక్షణ కోసం పాటుపడుతున్న ఈ హీరో గురించి మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
Preserving wildlife is integral to our cultural identity.
We are dedicated to persevering and safeguarding our rich cultural heritage.
Thank you for your kind words, @LeoDiCaprio, and I extend a warm invitation to you to visit @kaziranga_ and Assam. pic.twitter.com/iYhkvbT3I3
— Himanta Biswa Sarma (@himantabiswa) February 9, 2023