హఠాత్తుగా కుంగిపోయిన భూమిలో కార్లు కూరుకుపోయాయి… ఎందుకిలా!?

టెక్నాలజీ యుగంలో మనిషి జీవితంలో పెను మార్పులు చోటుచేసుకున్నాయి. ఒక రకంగా ఇవి ప్రకృతి విపత్తులకు కారణమవుతున్నాయి. ప్లాస్టిక్ వాడకం, నీటి కాలుష్యం, పర్యావరణ కాలుష్యం, వాతావరణ కాలుష్యం ఇతర కారణాలన్నీ ప్రకృతి సమతుల్యతను దెబ్బతీసి అకాల వాతావరణానికి కారణాలుగా మారుతున్నాయి. పెను మార్పులకు తావిస్తున్నాయి. ఇన్నాళ్లు మనం ప్రకృతి వనరులను నాశనం చేయడంలో బిజీగా ఉంటే ఇప్పుడు ప్రకృతి మన మీద పగ తీర్చుకోవడానికి తీరికలేకుండా కృషి చేస్తోంది. ఇటీవల మెక్సికోలో అకస్మాత్తుగా భూమి కుంగిపోవడంతో ఫుట్‌బాల్ మైదానమంత గొయ్యి పడింది. జెరుసలేంలోని ఓ హాస్పిటల్ వద్ద కూడా ఇలాంటి ఘటనే చోటుచేసుకుంది.

Screenshot 2షారీ జెదెక్ మెడికల్ సెంటర్‌లోని పార్కింగ్ స్థలంలోని భూమి ఒక్కసారిగా కుంగిపోయింది. దీంతో అక్కడ పార్క్ చేసిన నాలుగు కార్లు భారీ గుంత (సింక్ హోల్)లో పడిపోయాయి. ఈ ప్రమాద సమాచారం తెలియగానే ఏడు అగ్నిమాపక బృందాలు హుటాహుటిన అక్కడికి చేరాయి. క్షతగాత్రుల గురించి గాలించారు. లక్కీగా ఆ సమయంలో ఆ కార్లలో ఎవరూ లేకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. వారం రోజుల కిందట మెక్సికోలోని ప్యూబ్లా రాష్ట్రంలోని ఓ వ్యవసాయ క్షేత్రంలో 300 అడుగుల విస్తీర్ణంలో భూమి కుంగిపోయింది. సాంతా మారియా జ్యాకాటేపక్ అనే పట్టణంలో ఏర్పడిన ఈ సింక్ హోల్ పరిసర ప్రాంతాల్లో ఇళ్లను కూడా మింగేసే ప్రమాదం ఉందని ప్రజలు వణికిపోతున్నారు. ఈ గొయ్యి ఏర్పడిన తర్వాత భారీగా నీరు చేరింది. ఇప్పుడు ఆ గుంత నుయ్యిని తలపిస్తోంది.మొత్తానికి మానవాళిని అటు కరోనా, ఇటు ప్రకృతీ పగబట్టినట్టే ఉంది.