గిన్నిస్‌ బుక్‌లోకి వైట్‌ పెయింట్‌.. ఇంటికి ఈ పెయింట్ వేస్తే ఇక ఏసీ అవసరం లేదు!

White paint in the Guinness Book of World Records - Suman TV

రాయిని, రాయిని రాపాడిస్తే నిప్పు పుట్టుద్ది అన్న విషయాన్ని తెలుసుకోవడానికి మనిషికి వందల సంవత్సరాలు పట్టింది. అక్కడ నుండి మనిషి ప్రస్థానం అనేక మలుపులు తిరుగుతూ.., ఈరోజు మొత్తం విశ్వాన్నే జయించగలిగే టెక్నాలజీ దగ్గరికి వచ్చి ఆగింది. ఈ ప్రయాణంలో శాస్త్రవేత్తలు కనుగొన్న కొత్త విషయాలు ఎన్నో ఉన్నాయి.

గ్లోబల్ వార్మింగ్ స్థాయిని తగ్గించే విషయంలో, దానికి ఒక శాశ్విత పరిష్కారాన్ని కనుగునే విషయంలో శాస్త్రవేత్తలు విఫలం అవుతూనే వస్తున్నారు. ఇందుకే మన ఆసియా దేశాలు ఎండల నుండి తమని తాము రక్షించుకోవడానికి ఏసీల వాడకాన్ని ఎక్కువ చేశాయి. కానీ.., ఏసీ అనేది ఈ నాటికి మధ్య తరగతి మనిషికి అందుబాటులో లేని సౌకర్యం. ఇంట్లో ఏసీ ఉంటే కరెంట్ బిల్ ఎంత వస్తుందో ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన పని లేదు. అయితే.. ఇప్పుడు ఈ మొత్తం సమస్యకి పరిష్కారం కనుగొన్నారు యూఎస్‌ స్టేట్స్‌లోని పుర్‌డ్యూ యూనివర్సిటీ సైంటిస్టులు. వీరు ప్రపంచంలోనే అత్యంత తెల్ల పెయింట్‌ను తయారు చేశారు. ఈ పెయింట్ సూర్యకాంతికి రిఫ్లెక్షన్‌ ని దూరం చేసి., ఆ పరిసర ప్రాంతాన్ని అంతా చల్లగా చేస్తుంది. ఇప్పటికే ఈ పెయింట్ కి గిన్నిస్‌ బుక్‌ ఆఫ్‌ వరల్డ్‌ రికార్డులో స్థానం కూడా దక్కింది.White paint in the Guinness Book of World Records - Suman TVఈ వైట్ పెయింట్ ని వెయ్యి స్క్వేర్‌ ఫీట్ల మేర గోడకుగానీ, రూఫ్‌కుగానీ వేస్తే, పది కిలోవాట్ల కరెంట్‌ అందించే చల్లదనాన్ని అందిస్తుందట. ఇది ఇళ్లలోని ఏసీలు అందించే చల్లదనం కంటే చాలా రెట్లు ఎక్కువ. అంటే.. ఈ పెయింట్ గనుక మార్కెట్ లోకి వస్తే ఏసీల అవసరం ఉండదన్నమాట. కాస్మోటిక్స్‌లో ఉపయోగించే కెమికల్‌ కాంపౌండ్‌, అధిక గాఢత బేరియం సల్ఫేట్‌ కలిపి ఈ పెయింట్‌ను డెవలప్‌ చేశారు. ఇక ధర కూడా తక్కువగా ఉండి.. ఎక్కువ కాలం నిలిచే ఏ పెయింట్ మార్కెట్ లోకి రావడానికి ఇంకాస్త సమయం పట్టవచ్చు. మరి.. ఏసీలు అవసరం లేకుండా చేసే ఈ పెయింట్ త్వరగా మార్కెట్ లోకి రావాలని మీకు కోరుకుంటున్నారా? మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియ చేయండి.