అవినీతి పోలీసు బండారం…వాష్ రూం అంతా బంగారం!..

రష్యాలోని దక్షిణ స్టావ్‌రోపోల్ ప్రాంతంలో ట్రాఫిక్ పోలీసు అధికారి కల్ అలెక్సీ సఫోనోవ్ పై నమోదైన అవినీతి ఆరోపణలపై రష్యా అధికారులు విచారణ చేస్తున్నారు. ఈ క్రమంలో సదరు ట్రాఫిక్ పోలీస్ ఇంటిని తనిఖీ చేశారు. అక్కడి సౌకర్యాలను చూసిన అధికారులు విస్తుపోయారు. వాటికి సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట్లో వైరల్ అవుతోంది. ఈ ఇంటిని చూస్తే ఎవరూ పోలీస్ అధికారి ఇల్లు అనుకోరు. తప్పకుండా అది రాజభవనం కావచ్చని భావిస్తారు.

House minబెడ్ రూమ్ నుంచి టాయిలెట్ల వరకు అన్నీ మిలమిలా మెరిసిపోతున్నాయి. ఆ ఇంట్లో ఎక్కడ చూసినా బంగారు రంగు పెయింటింగ్ డిజైన్లే కనిపిస్తాయి. చివరికి టాయిలెట్లు సైతం బంగారమయమే. అవినీతి సొమ్ముతో అలెక్సీ ఏకంగా గోల్డెన్ టాయిలెట్‌ను కట్టించాడు. ఓ పెద్ద భవనం – విలాసవంతమైన గదులు, అతి ఖరీదైన వస్తువులతో అలంకరణలు, బంగారు బిడెట్ లాంటి ఎన్నో ఆ భవనంలో ఉన్నాయి. వాటన్నింటిని సీజ్ చేసిన అధికారులు అతడితో పాటు మరో 35 మంది అధికారులు ఓ ‘మాఫియా ముఠా’ నడుపుతున్నట్లు గుర్తించారు.

అవినీతి అధికారి ఇంటికి సంబంధించిన ఫోటోలు, సీసీ ఫుటేజ్‌ వీడియో లీక్‌ అయ్యాయి. ఈ వీడియోలో ఓ పెద్ద భవనంలో విలాసవంతమైన గదులు, అతి ఖరీదైన వస్తువులతో అలంకరణలు, బిలియర్డ్స్ హాల్, బంగారు బిడెట్, సింక్‌, బంగారు మరుగుదొడ్డి ఉన్నాయి. ప్రస్తుతం ఈ వీడియో సోషల్‌ వీడియాలో తెగ వైరలవుతోంది.

ప్రతిదానికి ఒక రేటు ఫిక్స్ చేసి భారీగా లంచాలు వసూలు చేశారని విచారణ అధికారులు కేసు నమోదు చేశారు. ఇప్పటి వరకు ఈ ముఠా రెండు లక్షల యాభై ఐదు వేల డాలర్లు దోచుకున్నట్లు లెక్కలు తేల్చారు. ఇక సఫోనోవ్‌ దోషిగా తేలితే 8 – 15 ఏండ్ల జైలు శిక్ష అనుభవించాల్సి ఉంటుందని అక్కడి అధికారులు చెబుతున్నారు.

ఈ ముఠా కొన్ని సంవత్సరాలు అవినీతికి పాల్పడుతున్నట్లు తెలుస్తోంది. చివరికి వారి ఇంట్లో టాయిలెట్లను సైతం బంగారంతో కట్టించారంటే వారు ఎంత వెనకేస్తున్నారో అర్థం చేసుకోవచ్చు.