కొన ప్రాణాలతో కొట్టుమిట్టాడుతున్న కొడుకు.. ఓ తండ్రి చేసిన పనికి ప్రపంచమే అవాక్కైంది

China

అరుదైన వ్యాదితో అభం శుభం తెలియని కొడుకు కొన ప్రాణాలతో కొట్టుమిట్టాడుతున్నాడు. అడుగు ముందుకేసి ఆస్పత్రుల చుట్టు తిరుగుదామంటే అడ్డంకిగా కరోనా ఆంక్షలు. ఎటు వెళ్లాలో తెలియదు. ఏం చేయాలో అర్థంకాని అగమ్యగోచర పరిస్థితి. నిమిషాలు, రోజులు దాటే కొద్ది కొడుకు ఆరోగ్య పరిస్థితి మరింత విషమించిపోతుంది. చేతిలో డబ్బులు లేదు, గుండె నిండా ధైర్యం లేదు. ఎటు చూసిన అన్ని దారుల్లో చీకటి కమ్ముకుంది. ఇదే సమయంలో ఆ తండ్రి తన గుండెను నిబ్బరం చేసుకున్నాడు. సాహసం చేసుందుకు ఓ అడుగు ముందుకేసి తన కుమరుడు బతికించుకున్నాడు. ఈ తండ్రి చేసిన సాహసానికి ఇప్పుడు యావత్ ప్రపంచం నివ్వరపోయి సెల్యూట్ చేస్తోంది. అసలు ఇంతకు కథేంటి. ఈ తండ్రి చేసిన సాహసమేంటో ఇప్పుడు తెలుసుకుందాం.

ఇతని పేరు గ్జువి. చైనాలోని కన్ మింగ్ ప్రాంతంలో నివాసం ఉంటున్నాడు. పెళ్లైన కొన్నాళ్లకి ఓ కుమారుడు జన్మించాడు. కానీ బాలుడికి జన్యుపరంగా అరుదైన మెంకస్ సిండ్రోమ్ అనే వ్యాధితో బాధపడుతున్నాడు. ఈ వ్యాధి బాలికల కన్నా బాలురులకే ఎక్కువగా వస్తుంది. ఇక ఈ వ్యాధితో మెదడు, నాడీ వ్యవస్థకు ఆటకంగా మారుతుంది. ప్రతీ లక్ష మందిలో ఒకిరికి వచ్చే ఈ వ్యాధి గ్జువీ రెండేళ్ల కుమారుడికి వచ్చింది.

ఈ వ్యాధి బారిన పడ్డవారు మూడేళ్ల కంటే ఎక్కువ కాలం బతికే అవకాశం లేనే లేదు. ఇక మందులు వాడితే ఈ వ్యాధి తీవ్రతను అరికొట్టవచ్చు. కానీ చైనాలో మాత్రం ఈ మందులు అందుబాటులో లేవు. ఇతర దేశాలకు వెళ్దామంటే కరోనా ఆంక్షలు అడ్డంకిగా మారాయి. ఏం చేయాలో అర్థం కాని పరిస్థితి గ్జువి ఎదుట నాట్యం చేస్తున్నాయి. ఎలాగైన తన కుమారుడిని బతుకించుకోవాలని గుండె నిండా ధైర్యాన్ని నింపుకున్నాడు. ఈ వ్యాధిని అరికట్టే కాపర్ హెస్టిడైన్ మందులు తయారు చేసేందుకు ప్రయత్నాలు మొదలు పెట్టాడు. ఇక అతను చదువుకుంది ప్రాథమిక విద్య మాత్రమే. ఈ వ్యాధిపై పూర్తి అవగాహన కోసం ఆన్ లైన్ ని వేదికగా మార్చుకుని చికిత్స, ఔషధాల గురుంచి అన్ని వివరాలు తెలుసుకున్నాడు.

China

ఇక కాపర్ హెస్టిడైన్ తయారికి అన్ని రకాల ప్రయాత్నాల్లో బుడి బుడి అడుగులు వేశాడు. సొంతంగా ఓ ల్యాబ్ ను తయారు చేసుకున్నాడు. దీంతో గ్జువీ తన ప్రయోగం మొదలు పెట్టిన సరిగ్గా ఆరు వారాల తర్వాత ఓ వయల్ ను సిద్దం చేశాడు. దీని ట్రయల్ లో భాగంగా మొదటగా ఎలుకల మీద ప్రయోగం చేశాడు. గ్జువీ మొదటి ప్రయోగం విజయం సాధించింది. ఆ తర్వాత మానవులపై ప్రయోగించుకోవాలని కాబట్టి తనపైనే ప్రయోగం చేసుకున్నాడు.

ఎలాంటి దుష్ప్రభావాలు దరి చేరలేదు. ఇక ఆలస్యం చేయకుండా చావైన బతుకైన అన్నిటికి తెగించి తను తయారు చేసిన మందును తన కుమారుడిపై ప్రయోగించాడు. ఇక ఆ బాలుడి శరీరంలో కోల్పొయిన కాపర్ ని అందించే ప్రక్రియలో తండ్రిగా గ్జువీ విజయం సాధించాడు. ఈ చికిత్స అనంతరం తన కోడుకు పెదవిపై చిరునవ్వుని చూశాడు. ఇక గ్జువీ చేసిన ఇంతటి సాహసానికి ప్రపంచ వైద్య నిపుణులు సైతం శభాష్ అంటున్నారు. ఇక గ్జువీ చేసిన ఇంతటి సాహసానికి వెక్టర్ బిల్డర్ అనే అంతర్జాతీయ బయోటెక్ ల్యాబ్ గ్జువీ చేసిన పరిశోధనపై ప్రశంసలు కురిపించింది.

ఆయనతో కలిసి మెంకస్ సిండ్రోమ్ వ్యాధిపై మరిన్ని పరిశోధనలకు చేసేందుకు ఒప్పందం కుదుర్చుకుంది. ఇలా ఓ కన్న కొడుకుని కాపాడుకునేందుకు గ్జువీ కన్నీళ్లు దాటుకుని ఓ అడుగు ముందు కేసి విజయ సాధించాడు. ఓ తండ్రి చేసిన ఇంతటి సాహసంపై ప్రపంచమే అవాక్కైంది. ఇలా ఇంతటి సాహసానికి పూనుకున్న గ్జువీపై మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి.