అరుదైన వ్యాదితో అభం శుభం తెలియని కొడుకు కొన ప్రాణాలతో కొట్టుమిట్టాడుతున్నాడు. అడుగు ముందుకేసి ఆస్పత్రుల చుట్టు తిరుగుదామంటే అడ్డంకిగా కరోనా ఆంక్షలు. ఎటు వెళ్లాలో తెలియదు. ఏం చేయాలో అర్థంకాని అగమ్యగోచర పరిస్థితి. నిమిషాలు, రోజులు దాటే కొద్ది కొడుకు ఆరోగ్య పరిస్థితి మరింత విషమించిపోతుంది. చేతిలో డబ్బులు లేదు, గుండె నిండా ధైర్యం లేదు. ఎటు చూసిన అన్ని దారుల్లో చీకటి కమ్ముకుంది. ఇదే సమయంలో ఆ తండ్రి తన గుండెను నిబ్బరం చేసుకున్నాడు. […]