ఘోర అగ్నిప్ర‌మాదం.. 46 మంది సజీవ దహనం!

దక్షిణ తైవాన్‌లో ఓ 13 అంతస్తుల టవర్‌లో చోటుచేసుకున్న అగ్ని ప్రమాదంలో 46 మంది మృత్యువాతపడ్డారు. పదుల సంఖ్యలో ప్రజలకు గాయాలయ్యాయి. ప్రస్తుతం 79 మంది ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారని వీరిలో 14 మంది పరిస్థితి విషమంగా ఉందని అగ్నిమాపక సిబ్బంది తెలిపారు. మంటలను అగ్నిమాపక సిబ్బంది అదుపులోకి తెచ్చింది. భవన శిథిలాల కింద చిక్కుకున్న వారిని వెలికితీసేందుకు అగ్నిమాపక సిబ్బంది సహాయక చర్యలు చేపట్టింది.

gasgasdg minదక్షిణ తైవాన్‌.. కౌహ్సియుంగ్‌లో ఉన్న ఆ భవాన్ని 40 సంవత్సరాల క్రితం నిర్మించారు. గురువారం వేకువజామున మంటలు చెలరేగాయి.. అవి క్రమంగా భవనం మొత్తం వ్యాప్తించాయి. భారీ శబ్దం విన్పించిందని ప్రత్యక్ష సాక్షులు మీడియాకు తెలిపారు. ఘటనా స్థలానికి చేరుకున్న మంటలు అదుపులోకి తీసుకురావడం అగ్నిమాపక సిబ్బందికి నానా తంటాలు పడ్డారు. భారీగా మంటలు వ్యాపించడంతో ఈ భవనంలోని పలు ప్లాట్స్ తీవ్రంగా దెబ్బతిన్నాయి. నల్లటి పొగ ఈ భవనంలో వ్యాపించి ఉందని అగ్నిమాపక సిబ్బంది చెప్పారు.

asdgasasgsdg minభవనంలోని కింది అంతస్తులో మంటలు చెలరేగాయని, ఈ భవనం పైఅంతస్తులో పలువురు నివాసం ఉంటున్నారని పోలీసులు వెల్లడించారు. కింది అంతస్తులో దుకాణాలు ఉన్నాయని వారు చెప్పారు. షార్ట్ సర్క్యూట్ కారణంగానే ఈ ప్రమాదం జరిగి ఉండొచ్చని పోలీసులు భావిస్తున్నారు. ఈ భవనంలో ఫైర్ ఫైటర్లు మంటలను ఆర్పుతున్న దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.