భార్యాభర్తలు అన్నాక గొడవలు, లవర్స్ అన్నాక విభేదాలు రావడం సహజం. ఇంత దానికే కొందరు దారుణాలకు పాల్పడుతున్నారు. అత్త మీద కోపం దుత్త మీద తీర్చినట్లు.. ఓ ప్రియురాలు ప్రియుడిపై ఉన్న కోపంతో ఎవరూ ఊహించని దారుణానికి పాల్పడింది. క్షణికావేశంలో ప్రియురాలు తీసుకున్న ఈ నిర్ణయానికి దాదాపుగా 46 మంది మరణించగా, 41 మందికి తీవ్ర గాయాలయ్యాయి. ఇటీవల తైవాన్ లో చోటు చేసుకున్న ఈ ఘటన దేశ వ్యాప్తంగా తీవ్ర కలకలంగా మారుతోంది.
అసలేం జరిగిందంటే? హువాంగ్ కేకే అనే మహిళ గతం కొంత కాలం నుంచి ఓ వ్యక్తితో ప్రేమలో ఉంది. అయితే కొన్ని రోజుల తర్వాత ప్రియుడు ఆమెను మోసం చేశాడు. దీనిని తట్టుకోలేకపోయిన ఆ ప్రియురాలు తీవ్ర మనస్థాపానికి గురైంది. ఇదే కోపంతో ఊగిపోయిన హువాంగ్ కేకే క్షణికాశంలో సియుంగ్‌లో ఉన్న ఓ భారీ భవనానికి నిప్పు పెట్టింది. ఈ ప్రమాదంలో 41 మంది ప్రాణాలు కోల్పోగా, 46 మందికి తీవ్ర గాయాలయ్యాయి. దీనిపై వెంటనే స్పందించిన అక్కడి పోలీసులు హుటాహుటిన మృతదేహాలను బయటకు తీసి క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.
అనంతరం ఈ ఘటన కారణమైన హువాంగ్ కేకేను అదుపులోకి తీసుకున్న పోలీసులు విచారించారు. అయితే పోలీసుల విచారణలో మాత్రం ఆ మహిళ.. నా ప్రియుడిపై కోపంతో చేశానే తప్పా.. ఉద్దేశపూర్వకంగా చేయలేదని పోలీసుల ముందు వాపోయింది. ఇక హువాంగ్ కేకే అరెస్ట్ చేసిన పోలీసులు కోర్టులో హాజరుపరిచారు. ఇటీవల చోటు చేసుకున్న ఈ ఘటన ప్రపంచ వ్యాప్తంగా తీవ్ర చర్చనీయాంశమవుతోంది. ప్రియుడిపై కోపానికి 41 మంది అమాయకపు ప్రాణాలను తీసిన ఈ మహిళ తీరుపై మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి.