దుల్కర్‌ సల్మాన్‌కు గోల్డెన్‌ వీసా ఇచ్చిన యూఏఈ ప్రభుత్వం.. దాంతో ఏంటీ ఉపయోగం

Free Dubai Visa For Dulquer Salman - Suman TV

మలయాళ స్టార్‌ హీరో దుల్కర్‌ సల్మాన్‌కు యూఏఈ ప్రభుత్వం గోల్డెన్‌ వీసా ఇచ్చింది. తమ దేశంలో ఫిల్మ్‌ ప్రొడక‌్షన్‌ ఇండస్ట్రీని అభివృద్ధి చేసేందుకు ప్రముఖులకు, టాలెండెట్‌ పీపుల్‌కు ఈ విధంగా గోల్డెన్‌ వీసాలు ఇస్తుంది అక్కడి ప్రభుత్వం. ఈ వీసాను పెట్టుబడిదారులు, అత్యుత్తమ ప్రతిభావంతులైన వ్యక్తులు, పరిశోధకులు, వైద్య నిపుణులు, శాస్త్రీయ, విజ్ఞాన రంగాల్లో ప్రముఖులకు దీర్ఘకాలిక రెసిడెన్సీని (5 నుంచి 10 సంవత్సరాలు) అందిస్తుంది. గతంలో ఈ వీసాను మలయాళ సూపర్‌స్టార్లు మమ్ముట్టి, మోహన్ లాల్‌ మొదట పొందారు. వీరితో పాటు నటుడు టోవినో థామస్, బాలీవుడ్ ప్రముఖులు సంజయ్ దత్, సునీల్ శెట్టి, బోనీ కపూర్, అతని కుమారుడు అర్జున్, కుమార్తెలు జాన్వి, అన్షులా, ఖుషీలకు ఈ వీసాను యూఏఈ ప్రభుత్వం జారీ చేసింది.