సినీ ఇండస్ట్రీలో మరో విషాదం చోటుచేసుకుంది. స్టార్ హీరో తల్లి కన్నుమూశారు. దీంతో పరిశ్రమలో విషాద ఛాయలు అలముకున్నాయి.
తెలుగు ప్రేక్షకులకు ఒక మంచి గుణం ఉంది. ఏ భాషకు చెందిన సినిమా అయినా బాగుంటే చాలు ఆదరిస్తారు. అందుకే మన దగ్గర డబ్బింగ్ చిత్రాలకు డిమాండ్ ఎక్కువ. వీటి ద్వారానే రజినీకాంత్, కమల్ హాసన్, విక్రమ్, కార్తీ, సూర్య లాంటి హీరోలు ఇక్కడా స్టార్డమ్ సంపాదించారు. అలా తెలుగు నాట పేరు తెచ్చుకున్న అతికొద్ది మంది పరభాషా హీరోల కోవలో మలయాళ సూపర్ స్టార్ మమ్ముట్టి కూడా ఉన్నారు. ఇక్కడ చేసింది తక్కువ సినిమాలే అయినా ఆయనకు మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. మమ్ముట్టి నటించిన సినిమాల తెలుగు డబ్బింగ్లకు ఓటీటీలో మంచి వ్యూస్ వస్తుంటాయి. త్వరలో అక్కినేని అఖిల్ మూవీ ‘ఏజెంట్’తో టాలీవుడ్ ప్రేక్షకులను మరోసారి పలకరించనున్నారు మమ్ముట్టి.
అలాంటి మమ్ముట్టి ఇంట్లో విషాదం నెలకొంది. ఆయన తల్లి ఫాతిమా ఇస్మాయిల్ (93) కన్నుమూశారు. కొన్నాళ్లుగా వృద్ధాప్య సమస్యలతో పాటు అనారోగ్యంతో బాధపడుతున్న ఫాతిమా కొచ్చిలోని ఒక ప్రైవేటు ఆస్పత్రిలో ట్రీట్మెంట్ పొందుతూ శుక్రవారం తెల్లవారు జామున తుదిశ్వాస విడిచారు. ఆమె మరణంతో మలయాళ ఫిల్మ్ ఇండస్ట్రీలో విషాద ఛాయలు అలముకున్నాయి. ఫాతిమా మృతిపై సినీ సెలబ్రిటీలతో పాటు రాజకీయ నేతలు సంతాపం తెలియజేస్తున్నారు. ఆమె అంత్యక్రియలు మమ్ముట్టి స్వగ్రామం కొట్టాయం దగ్గర్లోని చెంపులో నిర్వహించనున్నట్లు తెలిసింది. ఫాతిమా మృతిపై మలయాళ చిత్ర ప్రముఖులతో పాటు కోలీవుడ్, టాలీవుడ్ సెలబ్రిటీలు కూడా సంతాపం తెలియజేస్తున్నారు.
The 93-year-old mother of Actor #Mammootty, Fathima Ismail, passed away at a private hospital in the wee hours of Friday.
She was suffering from age-related illness. pic.twitter.com/tTrvNYbBxM
— IANS (@ians_india) April 21, 2023