చైనా మరో కృత్రిమ సృష్టి : మొన్న సూర్యుడు.. ఇప్పుడు చంద్రుడు

సైన్స్ అండ్ టెక్నాలజీని ఉపయోగించి చైనా చేస్తోన్న పరిశోధనలు, వాటి ఫలితాలు ఒక్కోక్కటి ప్రపంచాన్ని నివ్వేరపోయేలా చేస్తున్నాయి. ఇటీవల “కృత్రిమ సూర్యుడి”ని 17 నిమిషాల పాటు మండించి ‘ చైనా శాస్ర్తవేత్తలు చరిత్ర సృష్టించిన విషయం తెలిసిందే. తాజాగా చంద్రుడిపై పరిశోధన చేసి మరో అద్భుతం చేసింది. చంద్రమండలంపై పరిస్థితులతో ఓ బుల్లి చంద్రుడిని సృష్టించింది. చంద్రుడిలోని గురుత్వాకర్షణ శక్తినీ మాయం చేయడం ఇక్కడ విశేషం. భవిష్యత్‌ లో చంద్రుడిపై విస్తృత పరిశోధనలు చేయడానికి వీలుగా దీన్ని సిద్ధం చేసింది చైనా.

ఇది చదవండి : వేలానికి గ్ర‌హాంత‌ర ‘నలుపు’ వజ్రం! ధర తెలిస్తే మైండ్ బ్లాక్!

image 2 compressed 38ఈ బుల్లి చంద్రుడి సాధనం ప్రపంచంలో మరెక్కడా లేకపోవడం విశేషం. చైనాలోని జియాంగ్సు ప్రావిన్స్‌లోని షుజౌ నగరంలో ఏర్పాటు చేసిన ఈ కృత్రిమ చందమామను త్వరలో ప్రారంభిస్తారు. సాధారణంగా భూమితో పోలిస్తే చంద్రుడిపై గురుత్వాకర్షణ శక్తి ఆరో వంతు ఉంటుంది. చైనా సృష్టించిన చందమామలోనూ అదే తరహా పరిస్థితులు ఉంటాయి. ఈ కృత్రిమ చంద్రుడిలో ప్రధానంగా రెండు చదరపు అడుగుల విస్తీర్ణం కలిగిన గది, ఒక వాక్యూమ్‌ చాంబర్‌ ఉంటాయి. చంద్రుడిపై ఉండే గురుత్వాకర్షణ శక్తిని భూమి మీద సృష్టించడం చాలా క్లిష్టమైన ప్రక్రియ. ఇందుకోసం చైనా శాస్త్రవేత్తలు బలమైన అయస్కాంతాలను ఉపయోగించారు.

image 0 compressed 77ఈ కృత్రిమ జాబిల్లిలోని అయస్కాంత శక్తి తాకిడికి సూపర్‌ కండక్టింగ్‌ వైర్లు పేలిపోయే ప్రమాదం ఉంది. దీంతో పాటు భారీ అయస్కాంతాల కారణంగా అనేక లోహపు భాగాలు సక్రమంగా పనిచేయవు. ఈ సమస్యలను అధిగమించడానికి చైనా శాస్త్రవేత్తలు.. అయస్కాంత క్షేత్ర సమక్షంలో చాలా సులువుగా తేలియాడే చంద్రుడి ధూళి కణాలను రూపొందించారు. కీలకమైన పరికరాల్లో ఉక్కు స్థానంలో అల్యూమినియంను ఉపయోగించారు. ఈ కృత్రిమ చందమామ “మ్యాగ్నెటిక్‌ లెవిటేషన్‌” ఆధారంగా పనిచేస్తుంది.

ఇది చదవండి : సరికొత్త ఆన్లైన్ మోసం..నాలుగేళ్లలో 1000 కోట్లు !

రష్యాలో జన్మించి బ్రిటన్‌‌లో స్థిరపడిన శాస్త్రవేత్త ఆండ్రే గెయిమ్‌ గతంలో “మ్యాగ్నెటిక్‌ లెవిటేషన్‌” తో ఒక కప్పను గాల్లోకి లేపారు. దీనినే స్ఫూర్తిగా తీసుకుని చైనా కృతిమ చందమామ ప్రయోగాన్ని చేపట్టింది. దీనికి లీ రుయిలిన్ నేతృత్వం వహించారు. ప్రయోగంపై లీ రుయిలిన్ మాట్లాడుతూ.. “విమానం లేదా డ్రాప్ టవర్‌ లో తక్కువ గురుత్వాకర్షణ సాధించగలిగినప్పటికీ అది స్వల్పకాలమే ఉంటుంది.. సిమ్యులేటర్‌లో ఆ ప్రభావం కావలసినంత కాలం ఉంటుంది” అని అన్నారు. చైనా చేపట్టిన ఈ కృతిమ జాబిల్లి పరిశోధనపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.