ఆస్ట్రేలియాని వణికిస్తున్న చైనా ఎలుకలు! మరో మహమ్మారి రాబోతుందా?

elukaluకరోనాతో ప్రపంచదేశాలు వణికిపోతున్నాయి. ప్రజలు పిట్టల్లా రాలిపోతున్నారు. దేశాల ఆర్ధిక స్థితిగతులు మారిపోతున్నాయి. ఈ కష్టం నుండి బయటపడాలని ప్రపంచదేశాలు సర్వ శక్తులతో పోరాడుతున్నాయి. కానీ.., ఇలాంటి విపత్కర పరిస్థితిల్లోనే ఆస్ట్రేలియా దేశానికి మరో పెను ముప్పు ముంచుకొచ్చింది. ఆ ముప్పు పేరే ఎలుకలు. అవును.. మన ఇళ్లల్లో కనిపించే సాధారణ ఎలుకలు ఇప్పుడు ఆస్ట్రేలియా వాసులకి నిద్రలేకుండా చేస్తున్నాయి. ఒక్కొక్క ఇంట్లో పదులు కాదు, వందలు కాదు, ఏకంగా వేల సంఖ్యలో ఎలుకలు దర్శనం ఇస్తున్నాయి. బెడ్ రూమ్ నుండి బాత్ రూమ్ వరకు ఎక్కడ పట్టినా ఎలుకలే. ఇది ప్రస్తుతం ఆస్ట్రేలియాలో పరిస్థితి. నిజానికి సంవత్సర కాలంగా ఆస్ట్రేలియాకి ఏది కలసి రావడం లేదు. పోయిన ఏడాది ఈ దేశంలో అడవులు కాలిపోవడం వల్ల ఎంతటి నష్టం వాటిల్లిందో అందరికీ తెలిసిందే. ఆ తరువాత కరోనా బీభత్సం ఆస్ట్రేలియని వణికించింది. ఇక ఇప్పుడు ఈ ఎలుకల భీబత్సం వారిని చుట్టూ ముట్టింది. ఆస్ట్రేలియాలో గత వారం రోజులుగా ఆగకుండా వర్షాలు పడ్డాయి. ఇప్పుడిప్పుడే అక్కడ వరదలు తగ్గాయి. కానీ.., వర్షాల కారణంగా తమ నివాసాలు కోల్పోయిన ఎలుకలు అన్నీ ఇప్పుడు ఏకంగా ఇళ్లల్లోకి వచ్చేస్తున్నాయి. పంట పొలాల మీద దాడి చేసి రైతులకి తీవ్ర నష్టాన్ని మిగులుస్తున్నాయి. రెస్టారెంట్లు, షాపుల వాళ్లంతా తమ తమ బిజినెస్ లు మూసేసి మరీ ఎలుకల్ని పట్టుకునే పనిలో పడ్డారు. ముఖ్యంగా న్యూసౌత్వేల్స్, క్వీన్స్ల్యాండ్ రాష్ట్రాల్లో ఎలుకలు పుట్లకొద్దిగా పుట్టుకువస్తున్నాయి. ఇక్కడి ప్రజలు అందరూ ఎలుకలను పట్టే పనుల్లో బిజీ అయిపోయారంటే పరిస్థితి ఎంత దారుణంగా తయారైందో అర్ధం చేసుకోవచ్చు. టన్నుల కొద్దీ పాయిజన్ ఉపయోగించినా ఎలుకలు చావడం లేదు. కొత్తవి పుట్టుకొస్తూనే ఉన్నాయి. ఇక న్యూసౌత్వేల్స్ రాష్ట్ర ప్రభుత్వం ఎలుకల బెడద నివారణకు 5 కోట్ల డాలర్ల ప్యాకేజీ ప్రకటించింది. రైతులకు ఎలుకల విషం పాకెట్లు ఉచితంగా పంచడం, చిన్న వ్యాపారులకు, గృహస్థులకు ఎలుకల మందు రిబేట్లు లాంటి కార్యక్రమాలు చేస్తున్నారంటే ఆస్ట్రేలియాలో పరిస్థితి ఎంత దారుణంగా ఉందొ అర్ధం చేసుకోవచ్చు. ఇంట్లో బట్టలు, పుస్తకాలు, ఆహార పదార్ధాలు, వంట సరుకులు, తివాచీలు, సోఫాలు, కార్ సీట్లు అన్నిటినీ ఎలుకలు నాశనం చేస్తూ వస్తున్నాయి. ఇది పైకి కనిపించని దారుణమైన ఆర్ధిక నష్టంగా మిగలబోతుంది అని ప్రజలు బాధపడుతున్నారు. దీనికి తోడు.., విషానికి కూడా చావకుండా ఉంటున్న ఈ ఎలుకల వల్ల కొత్తగా ఎలాంటి వ్యాధులు పుట్టుకొస్తాయని ఆస్ట్రేలియా వాసులు భయంతో చస్తున్నారు. కానీ.., ఇక్కడే ఒక ఆశ్చర్యకరమైన వార్త బయటకి వచ్చింది. ఒకప్పుడు అసలు ఆస్ట్రేలియాలో ఎలుకలే లేవట. చైనా నుండి ఆస్ట్రేలియాకి వర్తకం కోసం వచ్చిన ఓ షిప్ నుండి చైనా ఎలుకలు ఆస్ట్రేలియాలోకి ప్రవేశించాయట . అప్పటి నుండి ఈ ఎలుకల సంఖ్య పెరుగుతూనే పోతుంది కాని తగ్గడం లేదు. ఇవి ఎన్ని విషాలు పెట్టినా తట్టుకునే శక్తిని కలిగి ఉంటున్నాయట. చైనా దశాబ్దాల క్రితం కావాలనే తమ దేశంలో ఇలాంటి ఎలుకలను వదిలిందా అన్న అనుమానాలు ఇప్పుడు ఆస్ట్రేలియన్స్ లో కలుగుతున్నాయి. 1993లో కూడా చైనాకి ఎలుకల వల్ల ఇలాంటి కష్టమే వచ్చింది. అప్పుడు 96 మిలియన్ డాలర్ల నష్టం ఏర్పడింది. మరి.. ఆస్ట్రేలియాలో ఈ ఎలుకల సంతతి ఎప్పుడు అదుపులోకి వస్తుందో చూడాలి.