కరోనాతో ప్రపంచదేశాలు వణికిపోతున్నాయి. ప్రజలు పిట్టల్లా రాలిపోతున్నారు. దేశాల ఆర్ధిక స్థితిగతులు మారిపోతున్నాయి. ఈ కష్టం నుండి బయటపడాలని ప్రపంచదేశాలు సర్వ శక్తులతో పోరాడుతున్నాయి. కానీ.., ఇలాంటి విపత్కర పరిస్థితిల్లోనే ఆస్ట్రేలియా దేశానికి మరో పెను ముప్పు ముంచుకొచ్చింది. ఆ ముప్పు పేరే ఎలుకలు. అవును.. మన ఇళ్లల్లో కనిపించే సాధారణ ఎలుకలు ఇప్పుడు ఆస్ట్రేలియా వాసులకి నిద్రలేకుండా చేస్తున్నాయి. ఒక్కొక్క ఇంట్లో పదులు కాదు, వందలు కాదు, ఏకంగా వేల సంఖ్యలో ఎలుకలు దర్శనం ఇస్తున్నాయి. […]