‘ఆహా’ సమర్పించు.. అలా ‘అమెరికా’పురములో… తమన్ బిగ్గెస్ట్ మ్యూజిక‌ల్ షో!!.

Thaman SS Music Sponcers By Aha - Suman TV

త‌మ‌న్ సంగీత సార‌థ్యంలో అమెరికాలో ‘ఆహా’ సమర్పించు ‘అలా అమెరికాపురములో..` పేరుతో బిగ్గెస్ట్ మ్యూజిక‌ల్ షోను హంసిని ఎంట‌ర్‌టైన్‌మెంట్‌ ఏర్పాటు చేసింది. బ్లాక్ బస్టర్ సినిమాలు, సూపర్ హిట్ వెబ్ సిరీస్‌లు, అదిరిపోయే షో లతో తెలుగు ప్రేక్షకుల మనసుల్లో స్థానం సంపాదించుకుని, డిజిటల్ రంగంలో దూసుకెళ్తున్న ఓటీటీ మాధ్యమం ‘ఆహా’ ఇప్పుడు మరో స్టెప్ ముందుకు వేసింది. సెన్సేషనల్ మ్యూజిక్ డైరెక్టర్ తమన్ ఆధ్వర్యంలో  ‘అలా అమెరికాపురములో’ పేరుతో బిగ్గెస్ట్ మ్యూజికల్ కాన్సర్ట్స్‌ను ‘ఆహా’ సమర్పిస్తోంది.   మ్యూజిక‌ల్ కార్నివాల్ అద్భుత ప్రదర్శన కోసం అమెరికాకు తీసుకువస్తోంది. ప్ర‌స్తుతం తమన్ అద్బుత‌మైన ఫామ్‌లో ఉన్నారు.   ఈ ఆగ‌స్ట్‌- సెప్టెంబ‌ర్ నెల‌ల‌లో త‌మ‌న్ యునైటెడ్ స్టేట్స్ లో పర్యటించాల్సి ఉంది. కొన్ని అనివార్య కార్య‌క్ర‌మాల వ‌ల్ల  అక్టోబ‌ర్ మ‌రియు న‌వంబ‌ర్ నెల‌ల‌లో వాషింగ్టన్ డి.సి., చికాగో, న్యూజెర్సీ, శాన్ జోస్ మరియు డల్లాస్ లో ప్రత్యక్ష ప్రదర్శనలు ఇవ్వబోతున్నారు.

Thaman SS Music Sponcers By Aha - Suman TVహంసిని ఎంట‌ర్‌టైన్‌మెంట్ గతంలో స్టార్ మ్యూజిక్ డైరెక్ట‌ర్స్ ఏఆర్ రెహమాన్ మరియు అనిరుధ్ రవిచంద‌ర్‌ల‌తో కలిసి అతిపెద్ద మ్యూజిక్ కాన్సర్ట్స్  నిర్వహించారు.  యునైటెడ్ స్టేట్స్‌లోని సంగీతాభిమానుల‌కు ది బెస్ట్ మ్యూజిక్ ఎక్స్‌పీరియ‌న్స్ అందించడానికి భారీ స్టేజ్ ప్రొడక్షన్‌తో పాటలు, నృత్యాలు, స్కిట్‌లు, విజువల్ ట్రీట్‌లతో పూర్తిస్థాయిలో వినోదం ఉండేలా ఈవెంట్స్ ప్లాన్ చేశారు నిర్వాహకులు.  వాషింగ్టన్ డీసీ, చికాగో, న్యూజెర్సీ, శాన్ జోస్, డల్లాస్‌లలో ప్రత్యక్ష ప్రదర్శనలు ఇవ్వనున్నారు. శివమణి, నవీన్, శ్రీ కృష్ణ, పృథ్వి చంద్ర, హరిక నారాయణ్, శ్రుతి రంజని, మనీషా, శాండిల్య, జోబిన్ డేవిడ్, సుభాశ్రీ, రాకేశ్ చారి, సిద్ధాంత్‌, ష‌దాబ్ రాయిన్ వంటి టాలెంటెడ్ సింగర్స్, మ్యుజీషియన్స్ తమన్ సంగీత బృందంలో ఉన్నారు.

అక్టోబర్ 30, నవంబర్ 5, 7 మరియు 26వ తేదీల్లో ఈ కార్యక్రమం జరుగనుంది. టికెట్స్ కావాలనుకున్న వారు www.sulekha.com లో బుక్ చేసుకోవచ్చు. వ్యాక్సిన్ యొక్క ప్రాముఖ్యతను తెలియ‌జేసి అంద‌రితో క‌లిసి జీవితాన్ని ఆనందించే పాత జ్ఞాపకాలను తిరిగి తీసుకురావడం ఈ కార్యక్రమ ముఖ్య ఉద్దేశ్యం.