హనీమూన్ ప్రత్యేకంగా ఉండాలనుకునే జంటకు శుభవార్త!

honeymoon

నేటి తరం యువత ఆలోచనలు కొత్తగా ఉంటున్నాయి. వేసుకునే దుస్తువుల మొదలు ప్రతి ఒక్కటి ప్రత్యేకంగా ఉండాలని భావిస్తారు. అదే విధంగా తమ పెళ్లిని ఎంతో ప్రత్యేకంగా చేసుకోవాలని ప్రణాళిక వేసుకుంటారు. ఇక పెళ్లి తర్వాత వెళ్లే హనీమూన్ను విషయంలో కూడా ప్రత్యేకంగా ఉండాలని కోరుకుంటారు. అలాంటి జంటల కోసం ఓ ప్రముఖ ఎయిర్లైన్స్ సంస్థ సరికొత్త ఆఫర్ ను వారి ముందుకు తీసుకు వచ్చింది.

ఆకాశంలో హనీమూన్ జరుపుకోవాలనుకుంటున్న వారికి అమెరికాకు చెందిన ‘లవ్ క్లౌడ్ జెట్ చార్టర్’ అనే విమాన సంస్థ “రాయల్ హనీమూన్” పేరుతో ప్రత్యేక ఆఫర్ ను ప్రకటించింది. ఇందులో భాగంగా..హనీమూన్ కోసం ప్రత్యేక విమానాన్ని సిద్ధం చేశారు. ఆ విమానం బుక్ చేసుకోవడానికి 995 అమెరికన్ డాలర్లు చెల్లిస్తే సరిపోతుంది. ఇక ఇండియా కరెన్సీలో చూస్తే గనుక రూ.73 వేలు చెల్లించాలన్నమాట. అయితే ఈ మొత్తం చెల్లిస్తే 45 నిమిషాల ప్రయాణానికి మాత్రమే అవకాశం ఉంటుంది. ఇంకా ఎక్కవ సమయం కావాలనుకుంటే.. అదనంగా డబ్బు చెల్లించాల్సి ఉంటుంది.

ఈ విమానంలో ప్రత్యేకంగా హనీమూన్ కు కావాల్సిన అన్ని సౌకర్యాలు ఉంటాయి. హనీమూన్ కోసం విమానంలో ప్రత్యేకంగా క్వీన్ బెడ్ ఏర్పాటు చేశారు. ఈ విమానానికి ఒకే ఒక పైలట్ ఉంటాడు. అలాగే.. పైలట్ కాక్పిట్ కి, విమానం ఇతర భాగానికి ఎలాంటి లింక్ ఉండదు. కాబట్టి జంట గోప్యతకు కూడా సమస్య ఉండదు. గత ఏడేళ్లుగా లవ్ క్లౌడ్ కంపెనీ వినియోగదారులను ఆకర్షించేందుకు ప్రత్యేక సేవలను అందిస్తూ వస్తోంది. రోమాంటిక్ డిన్నర్, విమానంలో పెళ్లి ఫెసిలిటీ వంటివి కూడా తీసుకువచ్చింది. ఈ సందర్భంలోనే ఇప్పుడు విమానంలో హనీమూన్ కు శ్రీకారం చుట్టింది. ఈ లవ్ క్లౌడ్ ప్రవేశ పెట్టిన ఈ ప్రత్యేక ఆఫర్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.