ఫేస్ బుక్ లో పెళ్లి ప్రపోజల్.. కోటి రూపాయలు కాజేసిన భార్యా భర్తలు

హైదరాబాద్- సమాజంలో సైబర్ నేరాలు బాగా పెరిగిపోతున్నాయి. అందులోను పెళ్లి పేరుతో ఏకంగా కొందరు కిలాడీలు అబ్బాయిలను బురిడీ కొట్టిస్తున్నారు. సోషల్ మీడియాలో వలపు వల విసిరి అందినంతా డబ్బులు దండుకుంటున్నారు కొంత మంది మహిళలు. తాజాగా హైదరాబాద్ లో పెళ్లి పేరుతో ఏకంగా కోటి రూపాయలు కొట్టేసిందో కిలాడీ.

సికింద్రాబాద్‌ కు చెందిన ఓ వ్యక్తి సాఫ్ట్‌ వేర్ కంపెనీలో ఉద్యోగం చేస్తున్నాడు. అతనికి 40ఏళ్లు దాటిగా ఇంకా పెళ్లి కాలేదు. ఈ క్రమంలో అతను మ్యాట్రిమోనీ సైట్ ద్వార పెళ్లి ప్రయత్నాలు చేస్తున్నాడు. మ్యాట్రిమోని ప్రొఫైల్‌ లో అతడి వివరాలు చూసిన గుంటూరు జిల్లాకు చెందిన యర్రగుడ్ల దాసు, జ్యోతి దంపతులు అతడి ట్రాప్‌ లోకి లాగి డబ్బులు కాజేయాలని పధకం వేశారు.

HYD Crime 2

సరిగ్గా సంవత్సరం క్రితం యర్రగుడ్ల దాసు, కల్యాణిశ్రీ పేరుతో ఫేస్‌ బుక్‌ ద్వారా సదరు సాఫ్ట్ వేర్ ఉద్యోగికి పరిచమయ్యాడు. తాను విజయవాడలో నివసిస్తున్నానని, సంప్రదాయ కుటుంబానికి చెందిన అమ్మాయినని చెప్పుకొచ్చాడు. అలా మాటలు కలిశాక, ఓ రోజు తనను ప్రేమిస్తున్నానని చెప్పడంతో ఆ సాఫ్ట్ వేర్ ఉద్యోగి ఆనందానికి అవధుల్లేవని చెప్పవచ్చు. అంతే కాదు పధకంలో భాగంగా విజయవాడకు రావొద్దని, కేవలం చాటింగ్ ద్వారానే మాట్లాడుకుందామని కండిషన్ పెట్టాడు.

ఇదంతా నిజమనుకున్న అతను తానూ ఆమెను ప్రేమిస్తున్నానని, ఇష్టమైతే పెళ్లి చేసుకుందామని ప్రపోజ్ చేశాడు. దీనికి అంగీకరించిన దాసు, పెళ్లి అంశంపై మధుసూదన్‌ అనే వ్యక్తితో మాట్లాడాలంటూ ఒక ఫోన్‌ నంబర్‌ ఇచ్చాడు. ఇక్కడ మరో ట్విస్ట్ ఏటంటే మధుసూదన్‌ లా కూడా గొంతు మార్చి మాట్లాడింది కూడా దాసే.