మాతృ దినోత్సవానికి కారణం ఆమె, జరుపుకోవద్దని చెప్పింది కూడా ఆమే

anna jarvis

స్పెషల్ డెస్క్- అమ్మ.. ఈ సృష్టికి మూలం.. అమ్మంటే ప్రేమకు ప్రతి రూపం.. అమ్మంటే సర్వస్వం.. అమ్మంటే ఆనందం.. అమ్మంటే అనంతం.. అమ్మంటే మాటల్లో వర్ణించలేని అద్భుతం.. అవును అమ్మ గురించి మాటల్లో ఎంతచెప్పినా.. పాటల్లో ఎంత పాడినా తక్కువే అవుతుంది. ఈ రోజు అంతర్జాతీయ మాతృదినోత్సవం సందర్బంగా సుమన్ టీవీ ప్రేక్షకుల కోసం ప్రత్యేక కధనం. మాతృ దినోత్సవాన్ని ఎప్పుడు.. ఎలా.. ఎవరు ప్రారంభించారో తెలుసుకుందాం. అన్నా జార్విస్ అనే మహిళ సపమారు వందేళ్ల క్రితం అమెరికాలో మదర్స్ డే ను ప్రారంభించింది. అన్నా జార్విస్ తన తల్లిదండ్రుల 13 మంది సంతానంలో ఒకరు. పదమూడు మందిలో తొమ్మిది మంది చిన్నతనంలోనే వివిధ కారణాలతో చనిపోయారు.

2017 5largeimg12 May 2017 163523010
anna jarvis

ఇక మిగిలిన నలుగురికి పెళ్లిల్లయ్యాక అన్నా జార్విస్ పెద్దన్న ఒక్కరికే పిల్లలున్నారు. అందులోనూ చాలామంది చిన్నతనంలోనే టీబీ, ఇతర కారణాలతో మరణించారు. అమ్మ కోసం ఒక ప్రత్యేకమైన రోజు ఉండాలన్న ఆలోచన జార్విస్‌కు తన తల్లి నుంచే వచ్చిందట. జార్విస్ తల్లి ఇతర తల్లులను చైతన్యపరుస్తూ, వారి వారి పిల్లల భవిష్యత్ గురించి జాగ్రత్తలు తీసుకునేలా సలహాలు, సూచనలు ఇచ్చేవారట. అమ్మలు చేసేపనికి గుర్తింపు ఉండాలని ఆమె భావించేవారు. 1858లో ఆమె మదర్స్ డే వర్క్ క్లబ్ ప్రారంభించినప్పటి నుంచి మెథడిస్ట్ ఎపిస్కోపల్ చర్చి కార్యకలాపాల్లో చురుగ్గా పాల్గొనేవారు. 1905లో ఆమె మరణించినప్పుడు ఆమె చుట్టూ ఉన్న మిగిలిన నలుగురు పిల్లల్లో అన్నా జార్విస్ తన తల్లి స్ఫూర్తిని కొనసాగిస్తానని ప్రతిజ్ఞ చేసిందని చెబుతారు. అన్నా జార్విస్ తల్లి ఇతరుల జీవితాలు మెరుగుపడేలా అమ్మలు చేసే పనికి గుర్తింపు దక్కాలని, అందరూ సెలబ్రేట్ చేసుకోవాలని తపన పడేవారు.

ఐతే అన్నా జార్విస్ మాత్రం అత్యుత్తమ మాతృమూర్తి ఎవరైనా ఆమె మీకు తల్లే అనే భావనతో ఈ మదర్స్ డేను మొదలుపెట్టారు. అందుకే Mothers Day అని బహువచనంతో కాకుండా Mother’s Day అని ఏకవచనంతోనే పిలుస్తారట. తన మొత్తం జీవితాన్ని మీ కోసం అంకితం చేసిన మీ అమ్మను గౌరవించే రోజు ఇది.. అనేది అన్నా జార్విస్ మాట. ఇక 1905లో అన్నా జార్విస్ తల్లి మరణించిన తరువాత మూడేళ్లకు అంటే 1908లో తొలిసారి గ్రాఫ్టన్ మెథడిస్ట్ చర్చిలో మే రెండో ఆదివారం రోజు మదర్స్ డే జరిపారు. అన్నా జార్విస్ రెండో ఆదివారాన్ని ఎంచుకోవడానికి కారణం ఆమె తల్లి మరణించిన మే 9వ తేదీకి రెండో ఆదివారం సమీపంలో ఉండడమే కారణమని చెబుతారు. ఆ తరువాత మదర్స్ డే కు బాగా పాపులారిటీ ఏర్పడింది. 1910 లో అమెరికాలోని వెస్ట్ వర్జీనియా రాష్ట్రంలో మదర్స్ డేకు సెలవు ఇవ్వడం ప్రారంభించారు. క్రమక్రమంగా 1914కి వచ్చేసరికి ఏకంగా అమెరికా వ్యాప్తంగా ఆ రోజును జాతీయ సెలవు దినంగా ప్రకటించారు అప్పటి అమెరికా అధ్యక్షుడు ఉడ్రో విల్సన్.

maxresdefault 5
anna jarvis

1951వ సంవత్సరం అధికారిక మదర్స్ డే పోస్టర్‌తో అమెరికన్ చిత్రకారుడు నోర్మాన్ రాక్‌వెల్ విడుదల చేశారు. మదర్స్ డేను జాతీయ సెలవు దినంగా ప్రకటించడానికి ముందు అన్నా జార్విస్ “మే రెండో ఆదివారం, మదర్స్ డే” అనేదానికి కాపీరైట్ తీసుకున్నారు. దీంతో కొన్ని సంస్థలు ఈ వేడుకలను జరిపేటప్పుడు మదర్స్ డేను బహువచనం (Mothers Day) గా వాడుతూ కాపీరైట్ నుంచి తప్పించుకునేవారు. 1944లో ప్రచురితమైన ఒక కథనం ప్రకారం అప్పటికి ఆమె వేసిన 33 కాపీరైట్ కేసులు పెండింగులో ఉన్నాయి. ఐతే ఇక్కడో ఆసక్తికరమైన విషయాన్ని చెప్పుకోవాలి. మధర్స్ డే ను ప్రారంభించిన అన్నా జార్విస్ కొన్నేళ్ల తరువాత మదర్స్ డే జరుపుకొనేవారు కాదని చెబుతారు. తాను ఏ స్ఫూర్తితో మదర్స్‌డే నిర్వహించతలపెట్టిందో.. అది కాస్తా పక్కదారి పట్టి పూర్తిగా వాణిజ్యమయం కావడంతో జార్విస్ మదర్స్ డేను జరుపుకోవడం మానేశారని చరిత్రకారిణి, వెస్ట్ వర్జీనియా వెస్లియాన్ కాలేజీ ప్రొఫెసర్ క్యాథరీన్ ఆంటోలినీ చెప్పారు.

Mothers Day email
mothers day founder

అన్నా జార్విస్ ఈ వేడుకలను అప్పుడూ వాణిజ్యంగా కోరుకోనప్పటికీ మధర్స్ డే సెలబ్రేషన్స్ అన్నీ పూర్తిగా వ్యాపారంగా మారిపోయాయి. పూల బొకేలు, గ్రీటింగు కార్డులు, బహుమతులు, చాక్లెట్ల రంగాలు ఈ మదర్స్ డేను వాణిజ్యంగా మార్చేశాయని అంటోలినీ తెలిపారు. ఐతే అన్నా జార్విస్ కోరుకున్నది ఇది కాదు. వేడుకలు పూర్తిగా వాణిజ్య రూపం దాల్చినప్పుడు ఆమె ఒక పత్రికాప్ర కటన విడుదల చేసి మదర్స్ డేను వ్యాపారంగా మార్చొద్దని అర్థించారట. 1920 నాటికి మదర్స్ డే రోజు పువ్వులు కొనడం, బొకేలు కొనడం మానుకోవాలంటూ ఆమె ప్రజలకు కూడా విన్నవించారు. తాను కోరుకున్న స్ఫూర్తిని మరచి వివిధ సంస్థలు కూడా దీన్ని పూర్తిగా మార్చేయడంపై ఆమె బాధపడేవారని ఆంటోలినీ చెప్పారు. ఇదండీ సంగతి. అంతర్జాతీయ మాతృదినోత్సవం వెనుక ఉన్న అసలు కధ తెలసుకున్నారు కదా. ఇప్పటికైనా మధర్స్ డే రోజు గ్రీటింంగ్స్, విశెష్, సెలబ్రేషన్స్ జరుపుకోవడం కాదు.. పిల్లల ఆధరణకు నోచుకోని తల్లులెందరో అనాధలుగా బతుకుతున్నారు.. వారిని మీ స్థోమత మేరకు ఆధరించండి.. అదే నిజమైన మాతృదినోత్సవం.