మదర్స్ డే సందర్భంగా తన తల్లికి శుభాకాంక్షలు తెలిపి.. ఆమె ఆశీర్వాదం తీసుకున్నారు మెగాస్టార్ చిరంజీవి. ఈ సందర్భంగా ఆయన చేసిన ట్వీట్ వైరలవుతోంది.
మే 14 ఆదివారం మదర్స్‌డే. మనకు జన్మనిచ్చి.. మన కోసం తన జీవితాన్ని త్యాగం చేసిన తల్లికి కృతజ్ఞతలు తెలుపుకునేందుకు నేడు మదర్స్ డే జరుపుకుంటున్నారు. సామాన్యులు, సెలబ్రిటీలు అనే తేడా లేకుండా అందరూ తమ తల్లి పట్ల ప్రేమను, కృతజ్ఞతను చాటుకుంటూ సోషల్ మీడియాలో పోస్ట్‌లు పెడుతున్నారు. ఈ క్రమంలో.. మదర్స్ డే సందర్భంగా తన తల్లి అంజనాదేవికి విషేస్ చెప్పాడు చిరంజీవి. మదర్స్ డే సందర్భంగా తన సోదరుడు నాగబాబు, చెల్లెళ్లతో కలిసి తల్లి దగ్గర ఆశీర్వాదం తీసుకున్నాడు. ఈ సందర్బంగా తీసిన ఫొటోలను సోషల్ మీడియాలో షేర్ చేశాడు.
ఈ ఫొటోలో పవన్ కళ్యాణ్ లేరు. ప్రస్తుతం పవన్ రాజకీయాలు, సినిమా షూటింగ్‌లతో బిజీగా ఉన్నారు. దాంతో ఆయన రాలేదు. ఇక చిరంజీవి.. తల్లితో కలిసి దిగిన ఫొటోలను షేర్ చేస్తూ.. ‘‘అనురాగం, మమకారం.. ఈ రెండింటికి అర్థమే అమ్మ. అమ్మ నవ్వు చేస్తూ.. అన్ని మర్చిపోతాం.. ప్రశాంతంగా ఉంటాం. నిరాడంబరంగా ఉండటం అంటే ఎలా అనేది నీ దగ్గరే మేమంతా నేర్చుకున్నాం. అమ్మలందరికి మదర్స్‌డే శుభాకాంక్షలు’’- మెగాస్టార్ చిరంజీవి అంటూ చేసిన ట్వీట్ వైరలవుతోంది.
అనురాగం, మమకారం… ఈ రెండిటికి అర్ధమే అమ్మ … అమ్మ నవ్వు చూస్తే అన్ని మర్చిపోతాం. నిరాడంబరంగా ఉండటం మేమందరం
అమ్మ ని చూసే నేర్చుకున్నాం.
అమ్మలందరికి #HappyMothersDay🙏💐 pic.twitter.com/6Xm4l1R14d— Chiranjeevi Konidela (@KChiruTweets) May 14, 2023
చిరంజీవి ప్రస్తుతం భోళా శంకర్ సినిమా షూటింగ్‌తో బిజీబిజీగా ఉన్నారు. మెహర్ రమేష్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో తమన్నా హీరోయిన్‌గా నటిస్తుంది. అయితే బిజీ షెడ్యూల్ ఉన్నప్పటికీ మదర్స్ డే సందర్భంగా చిరు.. తన తల్లి అంజనా దేవితో సమయం గడిపారు. ఇక ఈ ఏడాది వాల్తేరు వీరయ్య సినిమాతో గ్రాండ్ సక్సెస్ అందుకున్నాడు చిరంజీవి. మాస్ మహారాజ రవితేజతో కలిసి సంక్రాంతి బరిలో దిగిన మెగాస్టార్.. బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల సునామీ సృష్టించింది. వాల్తేరు వీరయ్య ఏకంగా రూ.100 కోట్లకు పైగా కలెక్ట్ చేసింది. త్వరలోనే భోళా శంకర్‌తో మరో సారి ప్రేక్షకుల ముందుకు రానున్నారు.