విష్ణుప్రియ.. సినిమాల నుండి టీవీ యాంకర్‌గా దూసుకు వచ్చిన సంగతి విదితమే. పోవే పోరాతో చాలా ఫేమస్ అయ్యింది. ఆ తర్వాత పలు షోలు చేసింది. యాంకరింగ్ చేస్తూ.. ప్రత్యేకమైన సాంగ్స్‌తో రచ్చ చేస్తూ కుర్రకారుకు కనువిందు చేస్తోంది. తాజాగా ఆమె షోలో కన్నీటి పర్యంతమైంది.
బుల్లితెరపై కూడా కాంపిటీషన్ పెరిగిపోయింది. వివిధ రకాల చానల్స్ పుట్టుకు రావడంతో..ఎంటర్‌టైన్ మెంట్‌కు కొదవలేదు. సరికొత్త ప్రోగ్రామ్స్ చేస్తూ టీఆర్పీలను పెంచుకునేందుకు కసరత్తులు చేస్తున్నాయి ఆయా చానల్స్. రోజు వచ్చే సీరియల్స్, సినిమాలు వీరితో తోడు ఏరోజు కారోజు కేటాయించి షోలు అలరిస్తూనే ఉంటాయి. ఇవి కాకుండా జనవరి ఫస్ట్ మొదలుకుని డిసెంబర్ 25 క్రిస్మస్ వరకు ప్రత్యేక కార్యక్రమాలను రూపొందించి, ప్రజలను టీవీలకు కట్టిపడేసేందుకు ప్రయత్నాలు చేస్తుంటాయి. ఇక పండుగలు లేని సమయాల్లో వాలంటీన్స్ డే, ఫ్రెండ్ షిప్ డే, ఫాదర్స్ డే, మదర్స్ డేను కూడా క్యాష్ చేసుకునేందుకు కసరత్తులు చేస్తుంటాయి. అయితే ఈ నెల 14న మదర్స్ డే సందర్భాన్ని పురస్కరించుకుని ప్రముఖ టీవీ సంస్థ ఓ కార్యక్రమాన్ని నిర్వహించింది.
మదర్స్ డేను పురస్కరించుకుని ‘ప్రియమైన అమ్మకు’అని కార్యక్రమాన్ని చేపట్టింది. అయితే ప్రముఖ యాంకర్ విష్ణుప్రియ, మానస్ ఈ షోకు వ్యాఖ్యాతలుగా వ్యవహరించారు. ఈ సందర్భంగా మానస్ మాట్లాడుతూ..‘మీ అమ్మను ఎంత మిస్ అవుతున్నావో.. మన ఆర్టిస్ట్ అందరినీ వాళ్ల ఫ్యామిలీస్ ఇక్కడ గెట్ టు గెదర్ లా ఆర్గనైజ్ చేశాను’ అంటూ చెప్పాడు. ఈ షో ప్రోమోను ఇటీవల విడుదల చేశారు. ఇందులో రాశి ముఖ్య అతిథిగా విచ్చేశారు. ఈ కార్యక్రమంలో బుల్లెట్ భాస్కర్ ఫ్యామిలీ, ఆది, జబర్దస్త్ నటీనటులు అందరు పాల్గొన్నారు. ఈ సందర్భంగా విష్ణుప్రియపై ఆది పలు కామెంట్లు చేశారు. చివరిలో విష్ణుప్రియ కన్నీటి పర్యంతమైంది.
విష్ణుప్రియ.. సినిమాల నుండి టీవీ యాంకర్‌గా దూసుకు వచ్చిన సంగతి విదితమే. పోవే పోరాతో చాలా ఫేమస్ అయ్యింది. ఆ తర్వాత పలు షోలు చేసింది. ఇవి కాకుండా ప్రత్యేక కార్యక్రమాల్లో మెరుస్తుంది. అయితే అప్పుడప్పుడు యాంకరింగ్ చేస్తూ.. ప్రత్యేకమైన సాంగ్స్‌తో రచ్చ చేస్తూ కుర్రకారుకు కనువిందు చేస్తోంది. అయితే ఇటీవల ఆమె తల్లి మరణించిన సంగతి విదితమే. ఆమె పట్ల ఎంత ప్రేమ ఉందో చెబుతూ సోషల్ మీడియాలో కూడా పోస్టులు పెట్టింది. తాజాగా ఆ షోలో కూడా చాలా ఎమోషనల్ అయ్యింది. తల్లిపై చేసిన స్కిట్ చూస్తూనే ఏడుస్తూనే ఉంది. చివరిలో ‘అమ్మా నెక్ట్స్ జన్మ ఉంటే నీ కూతురిగానే పుడతాను. ఐయామ్ సారీ, ఐలవ్ యూ’అంటూ ఏడ్చేసింది.