ఉపాసన ఫస్ట్ టైమ్ బేబీ బంప్ ఫొటోని సోషల్ మీడియాలో షేర్ చేసింది. మదర్స్ డే సందర్భంగా ఓ అద్భుతమైన ఎమోషనల్ పోస్ట్ చేసింది. ప్రస్తుతం ఇది కాస్త వైరల్ గా మారిపోయింది.
మెగా ఫ్యామిలీలోకి త్వరలో వారసుడు రాబోతున్నాడు. ఈ విషయం ఆల్మోస్ట్ ఫ్యాన్స్ అందరికీ తెలుసు. గత డిసెంబరులో మెగస్టార్ చిరంజీవి ఇన్ స్టాలో పోస్ట్ పెట్టాడు. తన కోడలు ప్రెగ్నెన్సీ ఉందని చెప్పుకొచ్చారు. అప్పటినుంచి ఇప్పటివరకు ఉపాసన పిక్ ఏదొచ్చినా సరే ఫ్యాన్స్ అలెర్ట్ అయిపోతున్నారు. లైకులు, షేర్స్ తో తమ అభిమానాన్ని చూపిస్తున్నారు. ప్రస్తుతం సమయాన్ని ఆస్వాదిస్తున్న ఉపాసన.. మదర్స్ డే (ప్రపంచ తల్లుల దినోత్సం) సందర్భంగా ఓ ఫొటో షేర్ చేశారు. ఇప్పుడదని కాస్త వైరల్ గా మారిపోయింది. క్యాప్షన్ అయితే ఎమోషనల్ గా ఉంది.
ఇక వివరాల్లోకి వెళ్తే.. మెగాపవర్ స్టార్ రామ్ చరణ్-ఉపాసన దాదాపు పదేళ్ల క్రితమే పెళ్లి చేసుకున్నారు. వాళ్లతో పాటు వైవాహిక జీవితంలోకి అడుగుపెట్టిన ఎన్టీఆర్, అల్లు అర్జున్.. ఇద్దరేసి పిల్లలకు తండ్రి అయిపోయారు. దీంతో చరణ్-ఉపాసనపై రకరకాల కామెంట్స్ వినిపించాయి. పిల్లలు వద్దనుకున్నారనే కామెంట్స్ కూడా వినిపించాయి. కానీ వాటికి చెక్ పెడుతూ గతేడాది డిసెంబరులో తాము తల్లిదండ్రులం కాబోతున్నట్లు ఉపాసన, రామ్ చరణ్ ప్రకటించారు. అప్పటినుంచి ఈ ప్రెగ్నెన్సీ సమయాన్ని ఉపాసన ఆస్వాదిస్తూ వచ్చారు. తాజాగా మదర్స్ డే సందర్భంగా ఆసక్తికర పోస్ట్ పెట్టి బేబీ బంప్ ఫొటోని ఫస్ట్ టైమ్ షేర్ చేశారు.
‘అమ్మతనం విషయంలో నేను చాలా గర్వపడుతున్నాను. ఎందుకంటే సమాజం కోసమో, కుటుంబ వారసత్వాన్ని కొనసాగించడానికో, పెళ్లి చేసుకున్నాననో నేను తల్లికావడం లేదు. నేను పిల్లలు కావాలని అనుకున్న టైంలో, అది కూడా నేను మానసికంగా సిద్ధమైన తర్వాతే పిల్లాడికి జన్మనివ్వాలనుకున్నాను. ఎందుకంటే చిన్నారికి లవ్ & కేర్ పూర్తిగా ఇవ్వాల్సి ఉంటుంది కదా. నా ఫస్ట్ మదర్స్ డే సెలబ్రేషన్స్’ అని ఉపాసన.. తన సోషల్ మీడియా ఖాతాల్లో బేబీ బంప్ ఫొటోని షేర్ చేశారు. మరి ఉపాసన బేబీ బంప్ ఫొటో, క్యాప్షన్ చూసిన తర్వాత మీకేం అనిపించింది. కింద కామెంట్ చేయండి.