అమ్మ ప్రేమకు వెల కట్టలేం. మరో జన్మలో తనకు అమ్మయితే తప్ప మాతృమూర్తి రుణం తీర్చుకోలేం. అసలు అమ్మ లేకపోతే.. ఈ సృష్టే లేదు. అలాంటి అమ్మకు ఏమిచ్చి రుణం తీర్చుకోగలం. ఆమె చూపించే ప్రేమకు దాసోహమవడం తప్ప. బిడ్డలపై అంతులేని అనురాగాన్ని, ప్రేమను చూపించే తల్లులకు కృతజ్ఞతలు తెలపడానికి గాను మదర్స్ డేను జరుపుకుంటారు. సామన్యులతో పాటు సెలబ్రిటీలు కూడా తల్లికి మదర్స్ డే విషెస్ తెలుపుతూ.. సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారు. అయితే సాధారణంగా తల్లి.. పిల్లలకు బహుమతులు ఇస్తుంది… కానీ మదర్స్ డే సందర్భంగా హీరోయిన్ రాశీ ఖన్నా.. తన తల్లికి ఖరీదైన గిఫ్ట్ ఇచ్చి.. ఆమెను ఆశ్చర్యపరిచారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఫోటోలు నెట్టింట వైరల్‌గా మారాయి. ఆ వివరాలు..
పలు ప్రాజెక్టులతో బిజీగా ఉన్నప్పటికీ ఆదివారం నాడు అమ్మ దగ్గరికి వెళ్లిన రాశీ ఖన్నా.. తల్లికి బీఎమ్‌డబ్ల్యూ కారును గిఫ్ట్‌గా ఇచ్చింది. దీని ధర దాదాపు రూ.1.40 కోట్లని తెలుస్తోంది. ఎప్పటికైనా ఓ లగ్జరీ కారు సొంతం చేసుకోవాలన్న తల్లి కలను రాశీ ఎట్టకేలకు నెరవేర్చింది. ప్రస్తుతం దీనికి సంబంధించిన ఫొటోలు వైరల్‌గా మారాయి. తల్లికి ఇంత మంచి గిఫ్ట్ ఇచ్చిన రాశీ ఖన్నాపై నెటిజనులు ప్రశంసలు కురిపిస్తున్నారు. ఇక సినిమాల విషయానికి వస్తే.. రాశీ ఖన్నా యోధ సినిమాతో త్వరలో బాలీవుడ్‌లో అడుగుపెట్టనుంది. సిద్దార్థ్ మల్హోత్రా, దిశా పటానీ ప్రధాన పాత్రల్లో నటించిన యోధ ఈ ఏడాది నవంబర్ 11న రిలీజ్ కానుంది. ఫర్జి అనే ప్రాజెక్ట్‌తో త్వరలోనే ఓటీటీలోనూ ఎంట్రీ ఇవ్వనుందీ బ్యూటీ. ఇక జూలై 1న గోపీచంద్‌తో కలిసి నటించిన పక్కా కమర్షియల్ సినిమాతో తెలుగు ప్రేక్షకులు ముందుకు రానుంది రాశీ ఖన్నా. తల్లికి ఇంత ఖరీదైన గిఫ్ట్ ఇచ్చిన రాశీ ఖన్నాపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.