ఉపాధి కోసం గ్రాడ్యుయేట్లూ ‘డ్రైనేజీ క్లీనింగ్’ చేస్తున్నారు!!.

ఏడాది కాలంగా దేశంలో క‌రోనా వైర‌స్ విల‌య‌తాండ‌వం చేస్తూ, ప్ర‌జ‌ల‌ను ఆర్ధికంగా, ఆరోగ్యప‌రంగా దెబ్బ‌తీసింది. కొన్ని రాష్ట్రాల్లో వీకెండ్ లాక్‌డౌన్, కర్ఫ్యూ అమల్లో ఉన్నాయి. అయినా ఇప్పటికే దేశంలో పరిస్థితి అదుపు తప్పిన కారణంగా సంక్రమణ ఆగడం లేదు. క‌రోనా కార‌ణంగా ఉద్యోగాల‌ను కోల్పోయిన వారి ప‌రిస్థితి దారుణంగా త‌యార‌య్యింది.  కొత్త కొలువులు లేనందున ఇంజినీర్లు, గ్రాడ్యుయేట్లు సంపాద‌న కోసం నాలాల‌ను శుభ్రం చేయవలసిన దుస్థితికి చేరుకున్నారు.

Graduates work at drinage compressed

ఏప్రిల్ నెల నుంచి దాదాపు 1.89కోట్ల మంది ఉద్యోగాలు కోల్పోయారట. ఉన్న‌త విద్య‌ను అభ్య‌సించిన నిరుద్యోగులు వర్షాకాలంలో మహారాష్ట్రలోని మంబ్రా ప్రాంతంలో నాలాలు శుభ్రం చేస్తూ క‌నిపిస్తున్నారు. మహారాష్ట్రలో డ్రెయిన్‌ల‌ను శుభ్రం చేసేప‌నిని రాష్ట్ర ప్ర‌భుత్వం ఒక‌ ప్రైవేట్ సంస్థ‌కు అప్ప‌గించింది. ఈ ప‌నుల్లో చాలా మంది విద్యావంతులు పాల్గొంటున్నారు.

గ్రాడ్యుయేట్‌ లు నాలాల‌ను శుభ్రం చేయ‌డం ద్వారా వ‌చ్చే ఆదాయంతో కుటుంబానికి చేదోడువాదోడుగా ఉంటున్నామ‌న్నారు. వారిలో   డబుల్ గ్రాడ్యుయేట్‌ లున్నారనీ, గత మూడు నెలలుగా ఈ కాంట్రాక్టర్ దగ్గ‌ర ప‌నిచేస్తున్నారని తెలుస్తోంది.   ఇంజినీరింగ్ పూర్తిచేసిన  ఈ ప‌నిచేయ‌డానికి ఏమాత్రం సిగ్గుపడటం లేద‌ని  మరికొందరు చెప్పడం విషాదం విచిత్రం.   ఇది కరోనా కలకలానికి మరో పార్శ్యం.