స్వల్పంగా పెరిగిన బంగారం ధర
10గ్రా 22 క్యారెట్ 150 రూపాయలు తగ్గింది.
10గ్రా 24 క్యారెట్ 170 రూపాయలు తగ్గింది.
22 క్యారెట్ 10గ్రా బంగారం 43,050.
24 క్యారెట్ 10గ్రా బంగారం 46,960.
1కిలో వెండి 63,000
బిజినెస్ డెస్క్- ఈ రోజు శనివారం బంగారం ధరలు స్వల్పంగా తగ్గాయి. శుక్రవారంతో పోలిస్తే 22 క్యారెట్ గోల్డ్ గ్రాము 10 రూపాయలు తగ్గింది. 24 క్యారెట్ గోల్డ్ ధర కూడా గ్రాముకు 11 రూపాయలు తగ్గింది. ఇక హైదరాబాద్ లో ఈరోజు 22 క్యారెట్ల బంగారం 10 గ్రాములకు 100 రూపాయలు తగ్గి 44 వేల రూపాయలు చేరింది. 24 క్యారెట్ల బంగారం 10 గ్రాములకు 110 రూపాయలు తగ్గి 48 వేల రూపాయలకు చేరింది. ఇక ఈ రోజు వెండి కిలో 1800 రూపాయలు తగ్గింది. దీంతో ఈ రోజు మార్కెట్లో వెండి కిలొ 63 వేల రూపాయలు పలుకుతోంది. గత పది రోజుల్లో 22 క్యారెట్ల బంగారం 10 గ్రాములు 500 రూపాయలు తగ్గింది. 24 క్యారెట్ల బంగారం కూడా 10 గ్రాములు 500 రూపాయలు తగ్గింది.
ఇక చెన్నైలో 10 గ్రాముల 22 క్యారెట్ బంగారం 43 వేల 360 రూపాయలు ఉండగా, 24 క్యారెట్ బంగారం 10 గ్రాములు 47,300 రూపాయలుగా ఉంది. ముంబయిలో 22 క్యారెట్ బంగారం 10 గ్రాములు 44,490 రూపాయులుండగా, 24 క్యారెట్ 10 గ్రాముల బంగారం 45,490 రూపాయలు పలుకుతోంది. దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ 10 గ్రాముల బంగారం 45,200 రూపాయలు ఉండగా, 24 క్యారెట్ 10 గ్రాములు 49,310 రూపాయలుగా ఉంది. అంతర్జాతీయ మార్కెట్ లో బంగారం దిగుమతులు తగ్గడం బంగారం ధరలపై ప్రభావం చూపుతోందని నిపుణులు అంటున్నారు. రేపు కూడా బంగారం ధరల్లో స్వల్ప మార్పులు ఉండే అవకాశం ఉందని మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి.