స్వల్పంగా పెరిగిన బంగారం ధర
10గ్రా 22 క్యారెట్ 550 రూపాయలు పెరిగింది
10గ్రా 24 క్యారెట్ 600 రూపాయలు పెరిగింది
22 క్యారెట్ 10గ్రా బంగారం 44,700.
24 క్యారెట్ 10గ్రా బంగారం 48,760.
1కిలో వెండి 66,600
బిజినెస్ డెస్క్- ఈ రోజు గురువారం బంగారం ధరలు భారీగా పెరిగాయి. బుధవారంతో పోలిస్తే 22 క్యారెట్ గోల్డ్ గ్రాము 55 రూపాయలు పెరిగింది. 24 క్యారెట్ గోల్డ్ ధర కూడా గ్రాముకు 60 రూపాయలు పెరిగింది. ఇక హైదరాబాద్ లో ఈరోజు 22 క్యారెట్ల బంగారం 10 గ్రాములకు 550 రూపాయలు పెరిగి 44 వేల 700 రూపాయలు చేరింది. 24 క్యారెట్ల బంగారం 10 గ్రాములకు 600 రూపాయలు పెరిగి 48 వేల 760 రూపాయలకు చేరింది. ఇక ఈ రోజు వెండి ధర కిలో 800 రూపాయలు పెరిగింది. దీంతో ఈ రోజు మార్కెట్లో వెండి కిలొ 66 వేల 600 రూపాయలు పలుకుతోంది. గత పది రోజుల్లో 22 క్యారెట్ల బంగారం 10 గ్రాములు 950 రూపాయలు పెరిగింది. 24 క్యారెట్ల బంగారం కూడా 10 గ్రాములు 1030 రూపాయలు పెరిగింది.
ఇక చెన్నైలో 10 గ్రాముల 22 క్యారెట్ బంగారం 45 వేల 050 రూపాయలు ఉండగా, 24 క్యారెట్ బంగారం 10 గ్రాములు 49,140 రూపాయలుగా ఉంది. ముంబయిలో 22 క్యారెట్ బంగారం 10 గ్రాములు 46 వేల 300 రూపాయులుండగా, 24 క్యారెట్ 10 గ్రాముల బంగారం 47 వేల 300 రూపాయలు పలుకుతోంది. దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ 10 గ్రాముల బంగారం 46,310 రూపాయలు ఉండగా, 24 క్యారెట్ 10 గ్రాములు 50,520 రూపాయలుగా ఉంది. రేపు కూడా బంగారం ధరల్లో స్వల్ప మార్పులు ఉండే అవకాశం ఉందని మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి. అంతర్జాతీయ మార్కెట్ లో బంగారం దిగుమతులు తగ్గడం బంగారం ధరలపై ప్రభావం చూపుతోందని నిపుణులు అంటున్నారు.