టాలీవుడ్‌ డ్రగ్స్‌ కేసులో విచారణ కు హాజరుకానున్న హీరో దగ్గుబాటి రానా!..

టాలీవుడ్‌ డ్రగ్స్‌ కేసులో నేడు విచారణ   హీరో దగ్గుబాటి రానా   ఉదయం 10.30 గంటల సమయం లో ఈడీ కార్యాలయానికి రాబోతున్నారు.   టాలీవుడ్‌ డ్రగ్స్‌ కేసు మరియు కెల్వీన్‌ కు ఉన్న సంబంధాలపై రానాను ప్రశ్నించనున్నారు ఈడీ అధికారులు.  ఇప్పటికే ఇప్పటికే 12 సినీ ప్రముఖు ల్లో నలుగురిని విచారణ చేశారు ఈడీ అధికారులు. నాలుగేళ్ల క్రితం సంచలనం రేపిన టాలీవుడ్‌ డ్రగ్స్‌ కేసుపై ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్(ఈడీ) దృష్టి పెట్టడం సర్వత్రా చర్చనీయాంశమైంది. ప్రధానంగా నిధుల అక్రమ మళ్లింపు నిరోధక చట్టం (పీఎంఎల్‌ఏ) పరిధిలోకి వచ్చే కేసులను మాత్రమే విచారణ జరిపే ఈడీ నాలుగేళ్ల నాటి కేసును దుమ్ము దులిపి మరీ కొత్తగా నోటీసులు జారీ చేయడం ఆసక్తికరంగా మారింది. డ్రగ్స్ సరఫరా, వినియోగంపై తెలంగాణ అబ్కారీ శాఖ దర్యాప్తు పూర్తిచేసి అభియోగపత్రాలు దాఖలు చేయగా ఈ వ్యవహారంలో నిధుల మళ్లింపు ఎలా జరిగిందో తెలుసుకునేందుకు ఈడీ నడుం బిగించింది.

rana compressedడ్రగ్స్ కొనుగోలు కోసం విదేశాలకు నిధులు ఎలా మళ్లించారో తెలుసుకునేందుకు తెలుగు సినీ పరిశ్రమకు చెందిన 12 మందికి ఈడీ నోటీసులు జారీచేసినట్లు తెలుస్తోంది.ఇక అటు టాలీవుడు డ్రగ్స్ కేసులో మొట్ట మొదటి సారిగా నోటీసులు అందుకున్నారు హీరో రానా. డ్రగ్స్ వ్యవహారం, మనిలాండరింగ్ వ్యవహారం పై రానాను ప్రశ్నించునున్నారు ఈడీ అధికారులు.  సుదీర్ఘంగా నటుడు నందు తో పాటు కెల్విన్, ఖుద్దుస్, వాహిద్ లను విచారణ చేశారు ఈడీ అధికారులు.  ఇప్పటికే ఈ టాలీవుడ్‌ డ్రగ్స్‌ కేసు లో పూరీ జగన్నాధ్‌, రకుల్‌ ప్రీత్‌ సింగ్‌, ఛార్మీ మరియు నటుడు నందు ను ఈడీ అధికారులు విచారణ చేసిన సంగతి తెలిసిందే.

సెప్టెంబ‌ర్ 9న ర‌వితేజ హాజ‌ర‌వుతున్నారు. రకుల్ ప్రీత్ సింగ్‌ను అయితే ఈడీ అధికారులు ఆరుగంట‌ల పాటు విచారించారు. ర‌కుల్ విచార‌ణ‌లో అయితే ఆమె బ్యాంకు అకౌంట్స్‌పై ఎక్కువ‌గా ఫోక‌స్ పెట్టి ప్ర‌శ్నించారు. కెల్విన్‌కు కూడా ర‌కుల్ ప్రీత్ సింగ్ చాలా సార్లు డ‌బ్బులు పంపిన‌ట్లు అధికారులు నిర్దారించుకున్న‌ట్లు వార్త‌లు వినిపిస్తున్నాయి.