ఎన్టీఆర్ ను జాగ్రత్తగా ఉండాలన్న చంద్రబాబు

హైదరాబాద్- యంగ్ టైగర్ ఎన్టీఆర్ కరోనా బారిన పడిన సంగతి తెలిసిందే. తానకు కరోనా సోకిందని స్వయంగా ఆయనే ట్విట్టర్ ద్వార తెలిపారు. ఐతే  ప్రస్తుతం కరోనా చికిత్స తీసుకుంటూ క్షేమంగానే ఉన్నానని, అభిమానులెవ్వరూ ఆందోళన చెందవద్దని చెప్పారు ఎన్టీఆర్. ఇక ఎన్టీఆర్‌ కు కరోనా అని తెలియగానే సినీ ప్రముఖులు, అభిమానులు ఆయన త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తున్నారు. ఈ క్రమంలోనే తెలుగుదేశం పార్టీ అధినేత, ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్య‌మంత్రి చంద్రబాబు నాయుడు ఎన్టీఆర్ ఆరోగ్యంపై ఆరా తీశారు. ఎన్టీఆర్ తో ఫోన్ లో మాట్లాడి ప్రస్తుతం ఆయన ఆరోగ్యం ఎలా ఉందో తెలుసుకున్నారు. అంతే కాదు.. తార‌క్ క‌రోనా నుంచి త్వ‌ర‌గా కోలుకోవాల‌ని కోరుకుంటున్నాను.. జాగ్ర‌త్త‌గా ఉండు.. అంటూ చంద్రబాబు ట్వీట్ చేశారు. ఈ మేరకు ఎన్టీఆర్ కరోనా సోకిందని చెసిన ట్వీట్‌ను చంద్రబాబు రీ ట్వీట్ చేశారు.

ఇక చంద్రబాబుతో పాటు పలువురు రాజకీయ, సినీ ప్రముఖులు గెట్ వెల్ సూన్ ఎన్టీఆర్ అంటూ ట్వీట్స్ పెడుతుండటంతో సోషల్ మీడియాలో ఎన్టీఆర్ కరోనా టాపిక్ వైరల్ అవుతోంది. నందమూరి అభిమానులు మాత్రమే కాకుండా ఇతర హీరోల అభిమానులు కూడా ఎన్టీఆర్ కోలుకోవాలంటూ ట్వీట్స్ చేస్తున్నారు. ఇక ఎన్టీఆర్ కు కరోనా సోకడంతో ఆర్ ఆర్ ఆర్ మూవీ ఇంకాస్త ఆలస్యం అయ్యే అవకాశం ఉందట. కరోనా నుంచి పూర్తిగా కోలుకొని, బయటి పరిస్థితులు చక్కబడ్డాకనే ఆర్ ఆర్ ఆర్ షూటింగ్ మళ్లీ మొదలవుతుందని ఫిల్మ్ నగర్ వర్గాలు చెబుతున్నాయి.