హైదరాబాద్- యంగ్ టైగర్ ఎన్టీఆర్ కరోనా బారిన పడిన సంగతి తెలిసిందే. తానకు కరోనా సోకిందని స్వయంగా ఆయనే ట్విట్టర్ ద్వార తెలిపారు. ఐతే ప్రస్తుతం కరోనా చికిత్స తీసుకుంటూ క్షేమంగానే ఉన్నానని, అభిమానులెవ్వరూ ఆందోళన చెందవద్దని చెప్పారు ఎన్టీఆర్. ఇక ఎన్టీఆర్ కు కరోనా అని తెలియగానే సినీ ప్రముఖులు, అభిమానులు ఆయన త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తున్నారు. ఈ క్రమంలోనే తెలుగుదేశం పార్టీ అధినేత, ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఎన్టీఆర్ ఆరోగ్యంపై ఆరా […]