బెగ్గర్స్ బ్యాంకు.. కేవలం 1 రూపాయి వడ్డీతో రుణాలు

స్పెషల్ డెస్క్- మనం ఏ ఆర్ధికపరమైన లావాదేవీలు జరపాలన్నా బ్యాంకుకు వెళ్లాల్సిందే. డబ్బులు డిపాజిట్ చేయాలన్నా, పెద్ద మొత్తంలో డబ్బులు డ్రా చేయాలన్నా బ్యాంకుకు వెెెెళ్లక తప్పదు. మన జీవితంలో బ్యాంకు ఓ భాగం అయిపోయింది. ఇక మన దేశంలో ప్రభుత్వ రంగానికి సంబందింన స్టేట్ బ్యాంక్, కెనరా బ్యాంక్ వంటి వాటితో పాటు ప్రైవేట్ రంగ బ్యాంకులైన హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్, ఐసీఐసీఐ బ్యాంక్ లు కూడా ఉన్నాయి. కొన్ని వీదేశీ బ్యాంకులు సైతం ఇండియాలో చాలానే ఉన్నాయి.

ఇప్పుడు ఈ బ్యాంకుల గురించి ఎందుకు చెబుతున్నారని అనుకుంటున్నారు కదా.. మీరు పైన చెప్పిన బ్యాంకులు కాకుండా ఎప్పుడైనా బెగ్గర్ బ్యాంకు గురించి విన్నారా. బిచ్చగాళ్ల బ్యాంకునే బెగ్గర్ బ్యాంకు అని అంటారు. బెగ్గర్ బ్యాంకేంటీ, బిచ్చగాళ్ల బ్యాంకేంటీ అని ఆశ్చపోతున్నారు కదా. ఐతే మీరు అసలు విషయం తెలుసుకోవాల్సిందే.

Begger Bank 1

బీహార్‌ లోని ముజఫర్‌ పూర్‌ లో బెగ్గర్ బ్యాంక్ ఉంది. కొంత మంది బిచ్చగాళ్లు ఈ బ్యాంకును ఏర్పాటు చేసుకున్నారు. అంతా బిచ్చగాళ్లే ఈ బ్యాంకును నిర్వహించుకుంటున్నారు. క్యాష్ డిపాజిట్లు, విత్‌ డ్రాయెల్స్, రుణాలు వంటివన్నీ ఈ బెగ్గర్ బ్యాంకులో కూడా ఉంటాయి. మొత్తం 175 మంది బిచ్చగాళ్లు స్వయం సహాయక గ్రూపులుగా ఏర్పడి ఈ బ్యాంక్‌ను ఏర్పాటు చేసుకున్నారు. ఈ బెగ్గర్ బ్యాంకుకు బీహార్ సోషల్ వెల్ఫేర్ డిపార్ట్‌మెంట్ చేయూత అందిస్తోంది.

స్వయం సహాయక గ్రూపుకు సంబందించిన కోఆర్డినేషన్ కమిటీ ఈ బ్యాంకు నిర్వహణ చూసుకుంటుంది. ప్రస్తుతం బెగ్గర్ బ్యాంకులో 175 మంది సభ్యులు ఉన్నారు. వీరిలో 70 శాతం మంది మహిళలే ఉన్నారు. అడుక్కోగా వచ్చిన డబ్బులను ఈ బ్యాంక్‌ లో డిపాజిట్ చేసుకుంటారు. ఇలా డిపాజిట్ చేసిన డబ్బులకు వడ్డీ వస్తుంది. బ్యాంక్ సభ్యులు ఈ డబ్బులను 1 శాతం వడ్డీతో లోన్ కూడా తీసుకోవచ్చు. భలే ఉంది కదా ఈ బెగ్గర్ బ్యాంకు.