‘మా’ హితమే మా అభిమతం.. ప్రకాశ్ రాజ్ ట్వీట్ పై బండ్ల గణేశ్ రీ ట్వీట్

ఫిల్మ్ డెస్క్- తెలుగు సినీ పరిశ్రమలో ‘మా’ ఎన్నికల కోలాహలం జోరందుకుంటోంది. ఎన్నికల తేదీ ప్రకటించక ముందు నుంచే పరువురి సినీ పెద్దల మధ్య మాటల యుధ్దం మొదలవ్వగా.. ఇక ఇప్పుడు నామినేషన్లు, ప్రచారం ఆర్బాటాలు ప్రారంభమయ్యాయి. ఇప్పటికే ప్రకాశ్ రాజ్, మంచు విష్ణు, బండ్ల గణేష్, సీవీఎల్ నరసింహా రావు లు నామినేషన్లు వేశారు. ‘మా’ ఎన్నికల్లో గెలుపుపై ఎరికి వారు ధీమా వ్యక్తం చేస్తున్నారు.

అక్టోబర్ 10న జరగనున్న ‘మా’ ఎన్నికలు జరగనుండటంతో అటు మంచు విష్ణు ప్యానెల్, ఇటు ప్రకాశ్ రాజ్ ప్యానల్ ప్రచారాన్ని ఉదృతం చేశాయి. ‘మా’ ప్రస్తుత అధ్యక్షుడు నరేష్‌తో కలిసి మంచు విష్ణు ప్రెస్‌ మీట్‌‌లు పెట్టి, ప్రకాశ్ రాజ్ అండ్ ప్యానల్‌ పై ఫైర్ అవుతుంటే, ప్రకాశ్ రాజ్ ట్విట్టర్ వేదికగా తన పూర్తి ప్యానల్ పిక్‌ని మరోసారి పోస్ట్ చేశారు.

323483 prakash raj bandla ganesh

మనస్సాక్షిగా ప్రతి ఒక్కరూ ఓటేయ్యండి అని ప్రకాష్ రాజ్ ట్విట్టర్ ద్వార అభ్యర్ధించారు. యువర్ ఓట్ ఇస్ యువర్ వాయిస్.. ‘మా’ హితమే మా అభిమతం.. మనస్సాక్షిగా ఓటేద్దాం.. మా ఆశయాలను గెలిపిద్దాం.. అంటూ ‘మా’ అధ్యక్ష బరిలో ఉన్న ప్రకాశ్ రాజ్ తన ట్విట్టర్‌ ద్వారా మా సభ్యులకు పిలుపిచ్చారు.

మరో వైపు ప్రకాశ్ రాజ్ ట్వీట్‌ని రీ ట్వీట్ చేస్తూ, ఒకే ఒక్క ఓటు మాత్రం జనరల్ సెక్రటరీగా పోటీ చేస్తున్న బండ్ల గణేష్‌కి వేయండి అంటూ బండ్ల గణేష్ విజ్ఞప్తి చేశారు. దీనికి నెటిజన్లు పలు రకాలుగా స్పందిస్తున్నారు. మొత్తానికి టాలీవుడ్ లో ‘మా’ ఎన్నికలు రాజకీయ వేడిని తలపిస్తున్నాయి. ఎవరికి వారు గ్రూపులుగా విడిపోవడంతో ‘మా’ ఎన్నికలు రసవత్తరంగా మారాయి. మరి గెలుపు ఎవరిని వరిస్తుందన్నదే ఆసక్తికరంగా మారింది.