మోహన్ బాబుకి చెందిన శ్రీ విద్యానికేతన్ కాలేజీకి అరుదైన హోదా!

మోహన్ బాబు.. తెలుగు రాష్ట్రాలలో ఈ పేరుకి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. ఎవరి సపోర్ట్ లేకుండా కష్టపడి పైకి వచ్చిన ఆయన.. ఇప్పుడు తనకంటూ ఒక బ్రాండ్ ని సెట్ చేసుకోగలిగారు. విలన్ గా, క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా, స్టార్ హీరోగా, నిర్మాతగా, రాజకీయవేత్తగా, విద్యావేత్తగా ఆయన ప్రస్థానం ఓ మహా అద్భుతం. ఇక వెండితెరపై తిరుగులేని నటుడిగా కొనసాగుతున్న సమయంలోనే మోహన్ బాబు విద్యావేత్తగా మారారు. తిరుపతిలో శ్రీ విద్యానికేతన్ కాలేజీని స్థాపించారు. గత 25 సంవత్సరాలుగా మోహన్ బాబు కులమతాలకు అతీతంగా తన విద్యా సంస్థలలో 25 శాతం రిజర్వేషన్స్ కల్పిస్తూ.. ఎంతోమంది పేద విద్యార్థులకు విద్యని అందించారు. ఇలా ఎన్నో లక్షల విద్యార్థుల జీవితాలను తీర్చిదిద్దిన శ్రీ విద్యానికేతన్ కాలేజీకి ఇప్పుడు యూనివర్సిటీ హోదా వచ్చింది. ఈ విషయాన్ని మోహన్ బాబు స్వయంగా ట్విట్టర్ లో పోస్ట్ చేయడం విశేషం.

siraeg min

ఇవి కూడా చదవండి:

సినీ పరిశ్రమ అంటే నలుగురు హీరోలు కాదు.. మోహన్ బాబు లేఖ

సీఎం జగన్ తో మెగాస్టార్ చిరంజీవి కీలక భేటీ!

”చిన్నగా ప్రారంభమైన శ్రీ విద్యానికేతన్‌ విద్యా సంస్థలు ఇప్పుడు కల్పవృక్షంగా మారాయి. నా జీవిత లక్ష్యం ఇప్పుడు యూనివర్సిటీ విద్యా విశ్వంలోకి చేరుకున్నాయి. తిరుపతిలో మోహన్ బాబు యూనివర్సిటీని ఇప్పటినుంచి మీకు అందిస్తున్నాను. మీరు చూపించే ప్రేమే నా బలం. మీ మద్దతు ఎప్పటికీ ఇలాగే ఉంటాయని కోరుకుంటున్నాను. కృతజ్ఞతలు” అంటూ మోహన్ బాబు ట్వీట్ చేశారు. మరి.. మోహన్ బాబుకి చెందిన శ్రీ విద్యానికేతన్ కాలేజీకి యూనివర్సిటీ హోదా దక్కడంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.