గోదారోళ్ల మజాకా.. కాబోయే కోడలికి ఏకంగా 100 రకాల స్వీట్లతో సారె!

Godavari

ఏ సమాజంలో అయినా సరే ప్రజలు తరాలుగా వస్తోన్న సంస్కృతి సంప్రదాయాలను పాటిస్తారు. ఆచార వ్యవహారాల విషయంలో కచ్చితంగా ఉంటారు. మరీ ముఖ్యంగా మన తెలుగు రాష్ట్రాల్లో పెళ్లిల్లలో పద్దతులు, పట్టింపులు ఎక్కువ. ముఖ్యంగా అల్లుడికి ఇచ్చే మర్యాద చాలా ఎక్కువ. పైళ్లైన కొత్తలో వచ్చే ప్రతి తొలి పండగ సమయంలో అల్లుడికి ఘనంగా మర్యాదలు చేస్తారు. పెళ్లి తర్వాత పంపే సారె కూడా ఇంతే ఘనంగా ఉంటుంది. సారె అనగానే.. వెంటనే గోదారోళ్లు గుర్తుకు వస్తారు.

కోనసీమ అనగానే అందమైన పకృతి మాత్రమే కాదు.. అక్కడి ప్రజలు ఇచ్చే ఆతిధ్యం కూడా గుర్తుకొస్తుంది ఎవరికైనా. గోదారోళ్లు అనురాగానికే కాదు, ఆప్యాయతకు కేరాఫ్ అడ్రస్. వెటకారంలోనే కాదు మమకారంలోనూ తగ్గేదెలే అంటారు. ఆతిథ్యం, పండగలు, శుభకార్యాలు ఏవైనా సరే గోదావరి జిల్లాల స్పెషాలిటీనే వేరు. తాజాగా ఓ ఇంటివారి నిశ్చితార్థ మహోత్సవానికి కళ్లు బైర్లు కమ్మే వెరైటీ స్వీట్స్ తయారు చేయించారు. ప్రస్తుతం దీని గురించే చర్చించుకుంటున్నారు. ఆ వివరాలు..

ఇది కూడా చదవండి: పెళ్లి పీటలెక్కనున్న స్టార్ హీరో – హీరోయిన్.. ఎంగేజ్మెంట్ ఫొటోస్ వైరల్!Marriage

నిశ్చితార్థం వేళ.. అమ్మాయి తరపువారికి 100 రకాల స్వీట్స్‌తో సర్‌ప్రైజ్‌ ఇచ్చారు పెళ్లికొడుకు తరుపు వారు. రకరకాల పళ్ల రూపంలో ఈ స్వీట్స్‌ తయారు చేయించారు. కోనసీమ జిల్లాలోని అమలాపురంలోని పూటి వారింటి కుమారుడి నిశ్చితార్థం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా సిద్దంశెట్టి వారింటి పెళ్లి కుమార్తెకు గుర్తుండిపోయేలా కానుకలు సమర్పించారు. ఈ వేడుక కోసం అమలాపురంలోని స్థానిక స్వీట్ షాప్‌ లో సుమారు 100 రకాల పళ్ల రూపంలో స్వీట్స్ తయారు చేయించారు. పెళ్ళి కుమార్తెకు పెట్టే సారెగా ఈ స్వీట్స్‌ని తీసుకెళ్లారు పెళ్లికొడుకు బంధువులు.

ఇది కూడా చదవండి: ఎక్స్‌లవ్‌, ఎంగేజ్‌మెంట్‌ బ్రేకప్‌పై రష్మిక ఓపెన్ కామెంట్స్!

ఇది చూసిన వధువు, ఆమె కుటుంబ సభ్యులు ఆనందంతో ఉక్కిరిబిక్కిరి అయ్యారు. పెళ్లికి ముందే తమ బిడ్డపై ఇంత ప్రేమ కురిపిస్తున్న అత్తగారు దొరకడం చాలా సంతోషంగా ఉందని తెలిపారు. అత్తింటి వారి అతిథిమర్యాదలపై ప్రశంసలు కురిపిస్తున్నారు. ఇక కొడలిపై ఈ రేంజ్‌లో మమకారాన్ని చాటుకున్న అత్తింటి వారిపై మీ అభిప్రాయాలను కామెంట్స్‌ రూపంలో తెలియజేయండి.

ఇది కూడా చదవండి: మీనా తల్లి కాబోతుందా.. ఆ వీడియో చూసి ఆశ్చర్యపోతున్న జనాలు!

మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం SumanTV App డౌన్లోడ్ చేసుకోండి.